డిజిపి కార్యాలయం.
మంగళగిరి (ప్రజా అమరావతి);
*డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ కి వచ్చిన ఫిర్యాదులపై రెండు రోజుల పాటు(26-04-2023, 27-04-2023)రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్టర్ మరియు తహశీల్దార్ కార్యాలయల పై ముపైకి పైగా ఏసీబీ అధికారుల బృందాలు 7 సబ్-రిజిస్టర్ కార్యాలయాలలు, 2 MRO కార్యాలయాల పైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సుమారు 1,09,28,000 అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించిన కార్యాలయాలు, స్వాధీనం చేసుకున్న నగదు, కేసుల వివరాలు;-*
1. *బద్వేల్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు,* కడప లో జరిపిన తనిఖీలలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి నుండి సుమారు 2,70,000, డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి సుమారు సుమారు 2,10,000 రూపాయలను జప్తు చేయడం జరిగింది. విరిపైన pc act SECTION-7 కింద కేసు నమోదు చేయడం జరిగింది.
2. *అనంతపురం రూరల్ SRO* లో జరిపిన తనిఖీలలో డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుండి సబ్-రిజిస్ట్రార్ కు డ్రైవరుగా(ప్రైవేట్) పనిచేస్తున్న ఎస్‌కే. ఇస్మాయిల్ వసూలు చేసిన 2,00,000పైగా నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
3. *కందుకూరు SRO,* నెల్లూరులో జరిపిన తనిఖీలలో సబ్-రిజిస్ట్రార్ చాంబర్ నుండి సుమారు 41,000 రూపాయలు, పలువురు డాక్యుమెంట్ రైటర్ల నుండి సుమారు 94,000 రూపాయల అదే విధంగా వన్నం సతీష్ అనే డాక్యుమెంట్ రైటర్ నుండి సబ్-రిజిస్ట్రార్ కు ఆరు నెలల వ్యవధిలో phone-pay ద్వారా సుమారు 2,36,000 పంపించినట్లు, అంతే కాకుండా సబ్-రిజిస్ట్రార్ అటెండర్ ఫయాజ్ కు phonePe ద్వారా 1,20,000 పంపినట్లు గుర్తించడం జరిగింది.
4 *తిరుపతి రూరల్ SRO,* తిరుపతి లో జరిపిన తనిఖీలలో డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి 90,000, కార్యాలయం లో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల నుండి 56,000, జూనియర్ అసిస్టెంట్ నుండి 9,000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
5. *నర్సాపురం SRO,* ఏలూరు లో జరిపిన తనిఖీలలో సబ్-రిజిస్ట్రార్ చాంబర్ నుండి 30,000 రూపాయలు, పలువురు డాక్యుమెంట్ రైటర్ల నుండి సుమారు 20,000, ప్రైవేట్ వ్యక్తి నుండి 6,000, సీనియర్ అసిస్టెంట్ నుండి 9,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
6. *జగదాంబ SRO,* విశాఖపట్నం లో సబ్-రిజిస్ట్రార్, జాయింట్ సబ్-రిజిస్ట్రార్ ఇద్దరు విధులు నిర్వహిస్తుండగా ప్రైవేట్ వ్యక్తి నుండి phonePe ద్వారా మూడు విడుతలుగా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కు 90,000 పంపించినట్లు గుర్తించడం జరిగింది. అదే విధంగా పదమూడు మంది డాక్యుమెంట్ రైటర్ల నుండి 39,000 రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు.
7. *తుని SRO,* కాకినాడ జిల్లా లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి 20,000, లెక్కలకురాని మరో 20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
8. *మేడికొండూరు MRO ఆఫీసు,* గుంటూరులో ఎంఆర్‌ఓ కార్యాలయంలో జరిపిన తనిఖీలలో 1,04,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
9. *జలమూర్ MRO ఆఫీసు,* శ్రీకాకుళo తో జరిపిన తనిఖిలలో తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుండి సుమారుగా 27,500 స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సంధర్భంగా *డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి* గారు మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్నా నగదు పైన సంబంధిత అధికారులు, వ్యక్తులు ఇచ్చిన వివరణలో కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం సబ్-రిజిస్టర్ల, ఇతరులపైన PC ACT సెక్షన్ 7 కింద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇద్దరు MROల పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా అధికారులు అవినీతికరమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
*ప్రజలు ఫిర్యాదు కోసం 14400*
అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
addComments
Post a Comment