స్పందన గ్రీవెన్స్ లు బియాండ్ ఎస్ఎల్ఏలోకి రాకూడదు.

 *స్పందన గ్రీవెన్స్ లు బియాండ్ ఎస్ఎల్ఏలోకి రాకూడదు*



*: గ్రీవెన్స్ లను గడువులోపు పరిష్కరించాలి*


*: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 19  (ప్రజా అమరావతి):


స్పందన గ్రీవెన్స్ లు బియాండ్ ఎస్ఎల్ఏలోకి రాకూడదని, గ్రీవెన్స్ లను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.


బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ నుంచి స్పందన గ్రీవెన్స్, బియాండ్ ఎస్ఎల్ఏలు, రీఓపెన్ గ్రీవెన్స్, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతిరోజు కార్యాలయానికి వెళ్ళగానే స్పందన పిటిషన్లను ఆన్లైన్లో ఓపెన్ చేసి చూసుకోవాలన్నారు. స్పందన గ్రీవెన్స్ లలో రెవెన్యూ కి సంబంధించి ఎక్కువ పిటిషన్లు వస్తున్నాయని, అగ్రికల్చర్, హౌసింగ్, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ కి సంబంధించి ఎక్కువగా పిటిషన్లు పెండింగ్ ఉన్నాయని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పందనకు సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ ఒకటి కూడా పెండింగ్ ఉండేందుకు వీలులేదని, ఒకటి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ లోకి రాకూడదని, తక్షణమే బియాండ్ ఎస్ఎల్ఏ లను పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ లను విత్ ఇన్ ఎస్ఎల్ఏ లోపు పరిష్కరించాలన్నారు. రీఓపెన్ కేసులు సింగల్ డిజిట్లోకి రావాలన్నారు. రీఓపెన్ కేసులను కూడా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. రీఓపెన్ కేసులు 28 ఉండగా, వాటిలో రెవెన్యూకు సంబంధించి 15 కేసులు ఉన్నాయని, బుధవారంలోపు వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను ఆదేశించారు. రీఓపెన్ కేసులకు నాణ్యమైన పరిష్కారం చూపించి మళ్లీ రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. ప్రతిరోజూ పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా బాధ్యతగా, అర్థం చేసుకుని పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.



Comments