చోరంపూడి(బంటుమిల్లి): ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి);
*ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మిన్ను విరిగి మీద పడ్డా నిలబెట్టుకునే వాడే మీ బిడ్డ జగన్
*
*అక్కలు చెల్లెళ్లు అమ్మలు జగనన్నను, నన్ను ఆశీర్వదించండి-మంత్రి జోగి*
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సోమవారం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో జడ్పీ పాఠశాలలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి వైయస్సార్ ఆసరా పథకం మూడో విడత నమూనా చెక్కులు అందజేశారు.
చోరంపూడి, ములపర్రు, మల్లంపూడి, నాగన్న చెరువు గ్రామాలకు చెందిన మహిళలు హాజరు కాగా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి 192 గ్రూపులకు చెందిన 1927 మంది సభ్యులకు 1.52 కోట్లు రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ విధంగా వెటర్నొక్కి డబ్బులు వేసే ముఖ్యమంత్రి జగన్ తప్ప ఎవరూ లేరన్నారు.
అమ్మఒడి, వైయస్సార్ చేయూత కింద ఏడాదికి రు. 18,750/- రేషన్ డోర్ డెలివరీ, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు జగన్ తప్ప ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని అన్నారు.
రాష్ట్రంలో 3648 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర చేసి మహిళల కష్టాలు కన్నీళ్లు చూసి, పాఠశాలల పరిస్థితి చూసి, సొంతిల్లు లేక అద్దె కట్టుకోలేని పరిస్థితులు చూసి ఇవన్నీ చేస్తున్నారని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు
విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు పథకం కింద పాఠశాలలు అద్భుతంగా తయారు చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టారు. పౌష్టికాహారంతో కూడిన జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నారు.
గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి 14 రకాలైన వైద్య పరీక్షలు 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు, ఇవన్నీ మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. అందుకే ఇవన్నీ మీకు వివరిస్తున్నానని అన్నారు.
104- వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ అమలకు ప్రతి గడపకు వైద్యులను పంపి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు.
16 వేల విలువైన ట్యాబ్ తో పాటు 16 వేల రూపాయల విలువైన బై జ్యూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ 8వ తరగతి విద్యార్థులకు అందజేయడం ద్వారా, వారు పదో తరగతిలోకి వచ్చే నాటికి అంటే 2025 నాటికి దేశంలో నిర్వహించు సీబీఎస్ఈ సిలబస్ కు సమాయత్తం చేస్తున్నారు జగన్. వివిధ పోటీ పరీక్షలను దీటుగా ఎదుర్కొని, ఎంపికై, ఉన్నత విద్య , ఉన్నత జీవితం అందించడం ద్వారా ఆర్థికంగా రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అభినందించాలని, ఆదరించాలని కోరారు.
జగన్ అందిస్తున్న పథకాలన్నీ వినియోగించుకొండి, పాఠశాలలకు వెళ్లి మీ పిల్లల చదువు గురించి ఆరా తీయండి బాగా చదివించండి ఇంటికో ఉద్యోగిని తయారు చేయండి మంత్రి మహిళలకు హితవు పలికారు.
మీ కష్టాలు ఇబ్బందులలో మీకు తోడుగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. నేరుగా నాకు ఫోన్ చేయాలని సూచిస్తూ, ఫోన్ నెంబర్ 98480 47522 ఫీడ్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల ఎంపీపీ చిన్న బాబు, జడ్పిటిసి వెంకటరమణ, మత్స్యశాఖ డైరెక్టర్ తిరుమాని శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment