*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*
అమరావతి (ప్రజా అమరావతి);
సమగ్ర శిక్షా ఎస్పీడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బి.శ్రీనివాసరావు
.
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులుగా శ్రీ బి.శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐ.ఎ.ఎస్ బ్యాచ్ కు చెందిన బి.శ్రీనివాసరావు సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల ఐఏఎస్ ల బదిలీల్లో ఎస్పీడీగా ప్రభుత్వం కేటాయించిన సంగతి విధితమే. ఇదివరకు ఎస్పీడీ స్థానంలో ఉన్న పాఠశాల విద్య కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ ఇక నుండి పూర్తిస్థాయిలో పాఠశాల విద్య కమీషనరుగా, ఇంటర్మీడియెట్ బోర్డు కమీషనరుగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు.
addComments
Post a Comment