దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు*



 *రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు*


 దళితుల గురించి మాట్లాడే

 హక్కు చంద్రబాబుకు లేదని

 మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు అన్నారు.  మంగళవారం తాడేపల్లి బైపాస్ రోడ్డు లోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. నిన్న టీడీపీ ఆఫీస్ లో దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత బాంధవుడు చంద్రబాబు అని

పుస్తకావిష్కరణ చేయడం

పట్ల దళిత సమాజం సిగ్గుతో తలవంచుకుంటుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎస్సీల కోసం 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారు ఎదుగుదలకు కృషి చేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు కేవలం రెండు మంత్రి పదవులు ఇస్తే  సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 మంత్రి పదవులు కీలక శాఖలు ఇచ్చారన్నారు.చంద్రబాబు 

రాజధానిలో అంబేద్కర్ విగ్రహం కడతానని చెప్పి

మాటకే పరిమితమయ్యారని  అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొట్టున  125 అడుగుల విగ్రహాన్ని కట్టటం జరుగుతుందని అన్నారు. దళితులు జగన్ తోనే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్,పాల్గొన్నారు.

Comments