*చిన్న పిల్లల వైద్య పరికరాలు వినియోగంలో ఉండాలి
*
పాలకొండ, ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): చిన్న పిల్లల వైద్య పరికరాలు వినియోగంలో ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శని వారం పాలకొండ ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిశుభ్రతలో రాజీ పడరాదని ఆయన అన్నారు. రోగులకు మందుల పంపిణీ, వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ల్యాబ్ నిర్వహణ, రక్త నమూనాల సేకరణ, రక్త నమూనాల నిల్వ ఉంచు పరికరాలు, మందుల నిల్వ, నిర్వహణ, రిజిస్టర్ లలో నమోదును వివరంగా తనిఖీ చేశారు. రోగులకు సమయానికి ఆహారం పంపిణి చేస్తున్నదీ లేనిది పరిశీలించారు. జనరేటర్ పనితీరు, సిబ్బంది వివరాలు పరిశీలించారు. వైద్యుల అందుబాటు, విధులకు హాజరు పై ఆరా తీసారు. బేబీ ఇంక్యుబెటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఓ.పి నమోదు వివరాలు అడిగారు. బేబీ ఇంక్యుబెటర్ తో సహా ఆసుపత్రుల్లో అన్ని పరికరాలు వినియోగంలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అల్ట్రా స్కానింగ్ ప్రింట్ రావాలని, మరమ్మతులలో ఉంటే పునరుద్ధరణ చేయాలని ఆయన పేర్కొన్నారు. బేబీ వార్మర్ లు పనిచేయాలని ఆయన అన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు నిరాటంకంగా సాగుటకు విద్యుత్ సరఫరా నిరంతరం సరఫరా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సంతృప్తికర వైద్య సేవలు అందాలని ఆయన అన్నారు.
*గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి*
ప్రతి శని వారం నిర్వహించే "గృహ నిర్మాణ దినోత్సవం" సందర్భంగా లుంబూరు గృహ నిర్మాణ కాలనీని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాలకు అనుకూల వాతావరణం ఉందని, ఇదే సమయంలో నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే నెలాఖరు నాటికి అన్ని గృహాలు పూర్తి చేయాలని, లబ్ధిదారులు సొంత ఇంటిలో ఉండాలని ఆయన తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. లే అవుట్ కాలనీలో ఉండటం వలన ప్రణాళికాబద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు కూడా మంజూరు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు వేగవంతం అవుతున్నాయని లుంబూరులో కూడా త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కోరారు.
అనంతరం సీతంపేటలో టి టి డి నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రత తదితర అంశాలను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వహణ ఇంజినీర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment