*పేదలను సంపన్నులను చేయడమే నా సంకల్పం
*
*ప్రపంచలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా నెంబర్ 1 జాతి గా నిలవాలి:- టీడీపీ అధినేత చంద్రబాబు*
*మార్గాపురంలో మహిళలతో ఆత్మీయ సమావేశం లో ఐడియాలజీ కాన్సెప్ట్ ను విడుదల చేసిన చంద్రబాబు*
మార్కాపురం (ప్రజా అమరావతి):- పేద ప్రజలను కోటీశ్వరును చేయడమే తన సంకల్పం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయడు మార్కాపురంలో మహిళలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక ఐడియాలజీ కాన్సెప్ట్ ను టీడీపీ అధినేత ప్రకటించారు. రెండు అంశాలపై సంకల్పం తీసుకుంటున్నట్లు ఆయన సభలో ప్రకటించారు.
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నంబర్ 1 స్థానంలో నిలవాలన్నది నా తొలిసంకల్పం అని చంద్రబాబు నాయడు అన్నారు. దాని కోసం పని చేస్తాను అన్నారు. తెలుగు ప్రజల్లో ఉండే పేద వర్గాల వారు కోటీశ్వరులు కావాలన్నది నా రెండోసంకల్పం అని చంద్రబాబు నాయుడు అన్నారు. అనుభవం, విజన్, టెక్నాలజీ వాడుకోవడం, సంపన్నులు తోటి వారికి సాయం చేయడం, ప్రజల మద్దతుతో ఈ కలను సాకారం చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఐడియాలజీ కాన్సెప్ట్ ను చంద్రబాబు నాయుడు వేదికపై సాదారణ మహిళలు, పిల్లలతో కలిసి విడుదలచేశారు.
పేదవాడికి అండగా, నిరుపేదకు తోడుగా ఉండాలన్నదే నా సంకల్పం. నేను చేసే పనులు, నా ఆలోచనలు నాకోసం కాదు.. ప్రజల బాగు, వారి భవిష్యత్ కోసమే. విజన్ 2020 వల్లనే హైదరాబాద్ నగరం నేడు ధనికులు ఎక్కువగా ఉన్ననగరాల్లో ప్రపంచంలో 65వస్థానానికి వచ్చింది? అని చంద్రబాబు అన్నారు. పేదలు కోటీశ్వరులు కాకూడదా? జగన్ ఒక్కడే కోటీశ్వరుడు కావాలా? వైసీపీ దొంగలు చెప్పే మాయమాటలు నమ్ముతారా? సంపదసృష్టించి, దాన్ని అందరికీ సమానంగా పంచాలన్న నా ఆలోచనలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.
గతంలో జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా సొంత గ్రామాలను అభివృద్ది చేసుకున్నామని...ఇప్పుడు ప్రణాళికా బద్దంగా పనిచేయడం ద్వారా ప్రజల జీవితాలను సమూలంగా మార్చవచ్చు అని చెప్పారు. సంపన్నులు తమ కుటుంబ సభ్యులకు, తోటి వారికి మెంటార్ గా నిలవడం ద్వారా, తగు సాయం చేయడం ద్వారా వారిని ధనికులుగా మార్చి జీవితాల్లో మర్పు తేవచ్చు అని అన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం నిర్మించేందుకు తాను పనిచేస్తానని....దీని కోసం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక పాలసీలు రూపొందిస్తాను అని చంద్రబాబు అన్నారు. విజన్ 2020 అని చెప్పిన సమయంలో దాన్ని అంతా హేళన చేశారని....కానీ కళ్ల ముందు ఆ ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నారు. అదే విధంగా ఒక ఐడియాలజీతో, ప్రణాళికతో పనిచేయడం ద్వారా పేదలను ధనికులను చేస్తాను అని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ ద్వారా కుటుంబం ఒక యూనిట్ గా తీసుకుని వారి జీవితాల్లోమార్పులు తెస్తాము అని ప్రకటించారు. దేశ విదేశాల్లో ఉన్న వారు తమ వారిని పైకి తెచ్చేందుకు తమ వంతు సాయం చేయాలని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పరంగా తాను చేసేది చేస్తాము అని చెప్పారు. తాను తీసుకున్న సంకల్పం నెరవేర్చేందుకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
addComments
Post a Comment