*నూజివీడులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*
*సభలో టీడీపీ అధినేత ప్రసంగం:-*
అమరావతి (ప్రజా అమరావతి);
• మూడు రోజులుగా నా పర్యటనకు అనూహ్య స్పందన కనిపిస్తుంది. ప్రజల్లో చైతన్యానికి ఇది నాంది.
• ఎవరి నోట విన్నా సైకో పాలన పోవాలి...సైకిల్ పాలన రావాలి అని కోరుకుంటున్నారు.
• ఈ సారి నూజివీడులో కూడా తెలుగు దేశం జెండా ఎగరాలి.
• రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా ఆనందంగా లేరు. అన్నింటిలో బాదుడే బాదుడు
• మళ్లీ ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచుతున్నాడు.
• భవిష్యత్ లో కరెంట్ చార్జీలుపెంచాల్సిన అవసరం లేదు అని చెప్పాను. కానీ జగన్ ముద్దులకు మోస పోయి మీరు జగన్ కు ఓటు వేసి గెలిపించారు
• 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఇచ్చింది 10 రూపాయలు...దోచింది 100 రూపాయలు
• జగన్ బటన్ నొక్కుడు కాదు...బటన్ బొక్కుడు. మాట్లాడితే నేను బటన్ నొక్కాను అంటాడు.
• బటన్ నొక్కుడు గొప్ప కాదు...సంపద సృష్టించే శక్తి ఉండాలి. ఆ సంపద పేదవారికి పంచే శక్తి ఉండాలి.
• ఇదొక పరిపాలనా అని నేను అడుగుతున్నా...ఇది అవినీతి పాలన.
• పేదలవాళ్ల బతుకులు అన్నీ చితికిపోయాయి. రైతులు కూలీలు నాశనం అయ్యారు.
• అమ్మఒడి ఇస్తున్నా అంటున్నాడు...అది నాన్న బుడ్డికి వెళ్లి పోయింది.
• రాష్ట్రంలో నాసిరకం బ్రాండ్లు, జె బ్రాండ్లు వచ్చాయా లేదా....
• తోపుడు బండి దగ్గర కూడా గూగుల్ పే నుంచి పే చెయ్యవచ్చు....కానీ మద్యం షాపులో మాత్రం ఆన్ లైన్ లో పేమెంట్ లేదు
• కొందరు కష్టపడి పనిచేసి...సాయంత్రం మద్యం తాగుతారు...అయితే ఇప్పుడు ఆ అలవాటు వల్లనే ఆర్థికంగా చితికిపోయారు...అనారోగ్యం పాలయ్యారు
• రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ఇసుక తరలిస్తున్నాడు.
• బటన్ బొక్కుడు ద్వారా జగన్ రెడ్డి ఆదాయం రూ. 2 లక్షల కోట్లు
• మీ పై పన్నుల భారం రూ 5 లక్షల కోట్లు.
• మీ పై మీ పిల్లలపై అప్పుల భారం రూ.10 లక్షల కోట్లు. అంటే ఒక్కో వ్యక్తిపై రెండు లక్షల అప్పు
• రాష్ట్రంలో దొంగల ముఠా పడింది....వైసీపీ ముఠా దోచుకుంటుంది.
• ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కదిలి రావాలి.
• క్విట్ జగన్...సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదం కోసం పనిచేయాలి
• ముఖ్యమంత్రి నేర చరిత్ర ఉండే వ్యక్తి. నిన్ననే కోడికత్తి డ్రామా బట్టబయలు అయ్యింది.
• ఇది కోడికత్తి కమల హాసన్ డ్రామా అని నాడే చెప్పాను. ఆ కోడికత్తి డ్రామా ఇప్పుడు బయట పడింది.
• ఐదు ఏళ్ల నుంచి కోడికత్తి నిందితుడు జైల్లో ఉన్నాడు. ఇదీ జగన్నాటకం.
• బాబాయ్ హత్య విషయంలో ఇలాగే చెప్పాడు....నేనే చంపాను అని అన్నాడు.
• హైదరాబాద్ లో అమరావతిని అభివృద్ది చేయాలి అని భావించాను. 2029 కి విజన్ కూడా సిద్దం చేశాను.
• అయితే జగన్ రావడంతో అన్నీ తల్లకిందులు అయ్యాయి.
• ఈ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తొలగించేందుకు చింతలపూడి లిఫ్ట్ స్కీం తీసుకువస్తే దాన్ని ఆపేశారు.
• జగన్ వచ్చి నాలుగు ఏళ్లు అయ్యింది.....అయినా బందరు పోర్టు పూర్తి చెయ్యలేదు. మళ్లీ శంకుస్థాపన చేస్తాను అంటున్నాడు
• ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్ పోర్టు ఇప్పటికి పూర్తి చెయ్యలేదు...మళ్లీ దానికి శంకుస్థాపన చేస్తాను అంటున్నాడు
• అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేస్తే విశ్వసనీయత.
• ఈ ప్రాంతంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకువచ్చాను. దాన్ని నిలిపివేశాడు. దాన్ని కొనసాగించి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవి
• జగన్ ను ప్రశ్నిస్తే కేసు పెడతాడు....మీరు భయపడుతున్నారు. ఇలా భయపడి ఎవరూ ప్రశ్నించకపోతే ఎలా
• ఇన్ని కేసులు పెట్టినా తెలుగు దేశం పోరాడింది. దీంతో ఇప్పుడు జనం కూడా బయటకు వస్తున్నారు.
• ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను. పార్టీనేతలను అరెస్టు చేస్తుంటే చాలా వేదన చెందాను.
• కొల్లు రవీంద్ర లాంటి అమాయకులపైనా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు
• గన్నవరంలో ఒక ఆడబిడ్డను ....కనీసం బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేశారు. పోలీసులు ఇదేం తీరు.
• పోలీసులు పెట్టే ప్రతి ఒక్క సమీక్ష్ చేస్తా....తప్పుడు పోలీసులను బొక్కల పెడతాను
• నేను అందరినీ అనడం లేదు.....తప్పు చేసిన అధికారులను మాత్రం వదిలేది లేదు. తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం
• నేను హైదరాబాద్ అభివృద్ది చేసింది నా పిల్లల కోసం కాదు. ప్రజల కోసం. వారి బిడ్డల కోసం. దీంతో అంతా లబ్ది పొందారు
• అమెరికాలో తెలుగు చాలా వేగవంతంగా విస్తరిస్తోంది. దానికి కారణం మన ఐటీ ఉద్యోగులు. టీడీపీ అందించిన ఐటీ ఆయుధం తో నే ఇది సాధ్యం అయ్యింది.
• ఈ రోజు వేరే రాష్ట్రాల వారు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది.
• తెలంగాణ ఎంపి వచ్చి మన రోడ్ల గురించి కామెంట్ చేశారు.
• మరో తెలంగాణ మంత్రి ఏముందిమీ రాష్ట్రంలో అని ప్రశ్నించారు.
• వైసీపీ సైతాన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
• 2019లో టీడీపీ వచ్చి ఉంటే ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉండేది
• ఇవాళ జగన్ ఆస్తి రూ.510 కోట్లు
• ఇడుపులపాయలో సొరంగం తవ్వి డబ్బు దాచిపెడుతున్నారేమో
• ఇవాళ జగన్ ఒక్కడే సంపన్నుడు
• ప్రజలు ఎప్పటికీ పేదవారిగా ఉండాలని జగన్ అనుకుంటున్నారుపట్టభద్రుల
• ఎన్నికల్లో వైసీపీకి దిమ్మ తిరిగింది
• దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు
• నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతున్నారు
• టీడీపీ అధికారంలోకి రాగానే పరిశీలించి చేస్తాం
• వివేకాను నేను చంపినట్టు నాటకాలు ఆడిన కమల్‌హాసన్ జగన్
• ఈ శనిగ్రహం రాష్ట్రాన్ని ఎప్పుడు వదిలిపెడుతుందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు
• జగన్‌కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది.. మరో 6 నెలలు మాత్రమే
• తిరుమలలో పింక్ డైమండ్ నేనే కాజేశా అన్నారు
• అధికారంలోకి వచ్చాక అసలు డైమండ్ లేదన్నారు
• వంద కోట్లకు పరువు నష్టం దాదా వేసి ప్రైవేట్ కేసు నడిపిస్తున్నా
• వీళ్లని తప్పకుండా బోనెక్కిస్తా - ఏపీలో ఏముందని తెలంగాణ నేతలంటున్నారు కనీసం రోడ్లైనా లేవని తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడుతున్నారు
• ఏపీ గురించి అలా మాట్లాడుతుంటే బాధ అనిపించడం లేదా?
• విశాఖ రామానాయుడు స్టూడియో భూములను కొట్టేశారు
• భూములు, సంస్థలను అడ్డగోలుగా రాయించుకున్నారు
• జగన్‌ది ధనబలం.. మనది ప్రజాబలం
• ఇక్కడ ఎమ్మెల్యే అవినీతిపర్వాన్ని కొనసాగిస్తున్నారు
• కరెంటు బిల్లు సాకు చూపి పెన్షన్లు తెగ్గోస్తున్నారు
• టీడీపీ అధికారంలోకి వస్తే.. నూజివీడు మామిడికి మంచిరేటు కల్పిస్తాం
• అందరం కలిసి సమిష్టిగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
• ఎమ్మెల్యే కొడుకు దుకాణం తెరిచాడు...అక్రమాలకు తెరతీశాడు. అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరుపుతాం.
addComments
Post a Comment