ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని రజనీ కాంత్ చెప్పారు.



*ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్  కమిటీ ఆధ్వర్యంలో!రూపొందించిన ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*రెండు పుస్తకాలను ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రజనీ కాంత్, బాలకృష్ణ*

 విజయవాడ (ప్రజా అమరావతి);

*సభలో టీడీపీ అధినేత ప్రసంగం:-*

ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని రజనీ కాంత్ చెప్పారు.


ఎన్టీఆర్ మెచ్చిన నగరం విజయవాడ, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సభ జరపడం ఆనందంగా ఉంది

సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ అసామాన్యం, రజనీ కాంత్ కి విదేశాల్లో కూడా అభిమానులున్నారు 

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రావాలని నేను రజనీకాంత్ గారిని  ఆహ్వానిస్తే....ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారు.

స్వేహానికి.. అప్యాయతకు మారు పేరు రజనీకాంత్, స్నేహం కోసం రజనీకాంత్ ఇక్కడికి వచ్చారు.

రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా నేను ఎన్టీఆర్ లాంటి వేషాలు వేయలేను అన్నారు అంటే చిన్న విషయం కాదు.

ఈ తరం వారు, భవిష్యత్ తరం వారు  కూడా ఎన్టీఆర్ లాంటి పాత్రలు చేయలేరు

తెలుగు వారిని అవమానించే సమయంలో...ఆత్మగౌరవం నినాదంతో పార్టీపెట్టారు.

సినిమాల్లో ఎన్టీఆర్ క్రమశిక్షణలో ఎప్పుడూ ముందు ఉంటారు. టైం అంటే టైం కు అంతా రావాల్సిందే.

ఎన్ని విమర్శలు వచ్చినా.....అనుకున్న పని చేసే నాయకుడు ఎన్టీఆర్

ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చే వరకు తెలుగు జాతి పోరాడాలి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే వరకు మనం తీర్మానం చేస్తూనే ఉందాం.

మళ్లీ దీనిపై తీర్మానం చేసి డిల్లీకి పంపుదాం.

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో ఇది మూడో మీటింగ్. ఇప్పుడే మీటింగ్ ఇంత అదిరిపోయింది అంటే....ఇక రాజమండ్రిలో జరిగే మీటింగ్ ఎలా ఉంటుందో చూడండి.

ఎన్టీఆర్ అంటే స్ట్యాట్యూ ఆఫ్ ప్రైడ్ కింద గుర్తించాలి. 

బాలకృష్ణ అటు సినిమాల్లో...ఇటు రాజకీయాల్లో కూడా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు 

మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న బాలకృష్ణను అభినందించాలి

వెంకట నారాయణ ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎన్టీఆర్ సినిమా నటుడే కాదు...చరిత్ర సృష్టించే యుగపురుషుడు అని పుస్తకం రాసిన వ్యక్తి వెంకట నారాయణ

స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ పేరుతో విగ్రహం.. మెమోరియల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. మహానాడు రోజున యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం. 

ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఎన్టీఆర్ పేరుతో మెమోరియల్ రూపొందేలా యాక్షన్ ప్లాన్

దీనిపై వచ్చే మహానాడులో ప్రత్యేక కార్యక్రమం ప్రకటిస్తాం.

ఫార్ములా P4 తో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం, ఫార్మూలా P4ను ఉద్యమంగా చేపడతాం.

Comments