*చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చిన చేనేత ముద్దుబిడ్డ తమ్మిశెట్టి జానకీదేవి
*
*ఆకురాతి రాజేష్ నోరు ఆదుపులో పెట్టుకో*
*తమ్మిశెట్టి జానకీ దేవిని విమర్శించే స్థాయి నాయకుడివా*
*తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు పడవల మహేష్*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి పట్టణ వైకాపా యువజన అధ్యక్షులు ఆకురాతి రాజేష్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జానకీదేవిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను పడవల మహేష్ శుక్రవారం ఖండించారు. జానకీదేవి, ఆమె కుటుంబంపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇప్పటికీ ఆమె అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. జానికీదేవి మామగారు గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే తమ్మిశెట్టి రామకృష్ణ గారు గతంలో పెళ్ళిలకు బంగారు మంగళసూత్రం, పొట్టు వస్త్రాలు సమర్పించిన గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపడుచుని విమర్శించడాన్ని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. మంగళగిరి పట్టణంలో చేనేత సామాజికవర్గానికి చెందిన తమ్మిశెట్టి రామకృష్ణ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని ఆకురాతి రాజేష్ కు సూచించారు. 2014 మున్సిపల్ ఎన్నికలో 9వ వార్డు వైకాపా కౌన్సిలర్ గా పోటీ చేసి 507 ఓట్ల తేడాతో ఓడిపోయావు. ఆర్కే ఇచ్చిన పార్టీ ఫండ్ దోచుకుని దాచుకున్న చరిత్ర నీదికాదా?. 2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆర్కే ఇచ్చిన పార్టీ ఫండ్ ను దొచుకుని మోసగించి ఆయన డబ్బుతో ఇళ్లు కట్టుకున్న చరిత్ర నీది కాదా ? అని పడవల మహేష్ ఆరోపించారు. నీ వార్డులో 600 ఓట్ల మోజార్టీ టీడీపీకి వచ్చాయన్న విషయం తెలుకో. స్మశాన స్థలంలో అనాధికారికంగా అక్రమంగా 4 అంతస్థుల ఇల్లు కట్టుకున్నావు. నీవు కట్టుకున్నా ఇంటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా అంటూ పడవల మహేష్ ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీనామీ రేషన్ డిపో నడుపుతూ రేషన్ మాఫీయాను కొనసాగిస్తున్నావు. తెల్ల చోక్కా వేసుకుని పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు చేస్తూ కమిషన్ ఏజెంట్ గా పని చేస్తున్నది ఎవరనేది మంగళగిరి పట్టణంలో అందరికి తెలుసు అన్నారు. 2004లో తమ్మిశెట్టి జానకీదేవి బిజెపి జాతీయ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసి 39, 900 ఓట్లు సంపాదించారు. 2009 ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్దిగా జానకీదేవి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలుసుకోవాలన్నారు. 41వేల ఓట్లు సాధించినట్లు తెలిపారు. వార్డు కౌన్సిలర్ గా కూడా గెలువలేని ఆకురాతి రాజేష్ నోరు ఆదుపులో పెట్టుకుని మాట్లాడాలని పడవల మహేష్ హెచ్చరించారు. ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని మాట్లాడితే జానికీదేవిని నోటికి వచ్చినట్లు విమర్శిస్తావా ? కళ్లజోడు వేయించుకోని చూస్తే యువగళ పాదయాత్ర ఏ విధంగా జరుగుతుందో మీకు అర్థమవుతుందన్నారు. కేజీఎఫ్ తరహాలో ఉండవల్లి కొండలను అనకకొండలా మింగేశారని విమర్శించారు. గిరి ప్రదక్షణ పేరుతో మట్టి మొత్తం దోచుకున్నట్లు ఆరోపించారు. మంగళగిరికి బడ్జెట్ లో కేటాయించిన రూ. 2500 కోట్లపై స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మీ ఆర్కే లాగా ఎక్కడ కుంభకోణాలు చేయలేదు. మీ ఆర్కే నేను నడిచి స్కూల్ కి వెళ్ళాను, గోనుపట్టల గుడ్డల్లో స్కూల్ బ్యాగ్ మోసుకెళ్లారని చెబుతుంటాడు మరి అలాంటోడికి లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినయో నువ్వు కూడా చెప్పాలి. మరి నువ్వు కూడా ఎల్బీనగర్లో మూడు అంతస్తుల బిల్లింగ్ కట్టావ్ ఆ బిల్డింగ్ కు కూడా ప్లాన్ లేదు. పి.ఎం.ఏ వై గృహాలలో అక్రమాలకు పాల్పడ్డావు. ఇలాంటి అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నవాడివి నువ్వు ఏ విధంగా మా నాయకురాలు గురించి మాట్లాడతావు. మంగళగిరిలో అవినీతి తాండం చేస్తుంది. త్వరలోనే మీ అవినీతి మొత్తం బయట పెడతామని ఈ సందర్భంగా పడవల మహేష్ తెలిపారు.
addComments
Post a Comment