శ్రద్ధ పెట్టి పని చేయకపోతే కఠిన చర్యలు*
*: అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పథంలో నడిపించాలి*
*: సర్వేయర్లు, సిబ్బంది సక్రమంగా పనిచేయాలి*
*: పనిలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు*
*: క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి పర్యటించాలి*
*: ఆర్డీఓలు, తహసీల్దార్లు వారానికి ఒకసారి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి):
అధికారులు శ్రద్ధ పెట్టి పని చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పనిలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు హెచ్చరించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, హౌసింగ్, ఐసిడిఎస్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ, వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీవోలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్, డిఆర్ఓ కొండయ్య, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు శ్రద్ధ పెట్టి పని చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు వారానికి ఒకసారి వారి పరిధిలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఆర్డీఓలు వారి పరిధిలోని తహసీల్దారులతో అభివృద్ధి పనులపై ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆరా తీయాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత హెచ్ఓడిలతో సంప్రదించి ఫలితాలపై పట్టు8 సాధించాలన్నారు.భూసర్వే పనులను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆ దిశగా సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి సంబంధిత అధికారులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను సంబంధిత అర్డిఓ లు, తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. గ్రౌండ్ వ్యాలీడేషన్, ఓఆర్ఐ ప్రక్రియను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలన్నారు. రీ సర్వే పనులు పక్కాగా చేయకపోతే రెండవ సారి చేయాల్సి వస్తుందన్నారు. రీ సర్వేకు సంబంధించిన ప్రతి పని జాగ్రత్తగా పరిశీలించి చేయాలన్నారు.
వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రాళ్ళు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. సర్వే పనులను సంబంధిత అధికారులు అందరూ బాధ్యతగా తీసుకొని పూర్తి చేయాలన్నారు. ఒక ఎల్పిఎంకు సంబంధించి ఒకే ఖాతా నెంబర్ ఉండేటట్లు చూడాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో మొదటి దశ రీసర్వేలో బాగా చేశారని, రెండవ దశ రీ సర్వే కూడా బాగా జరగాలన్నారు. చెన్నేకొత్తపల్లి మండలానికి సంబంధించి 2,600 స్టోన్లు రావడం జరిగిందని, వీఆర్వోలు, సర్వేయర్లు టీంలుగా ఏర్పడి రోజు 1,200 రాళ్లు చొప్పున నాటి మే 5వ తేదీలోపు స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పిల్లల ఆరోగ్యం పై వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆరా తీయాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని, ఈ విషయమై సోషల్ వెల్ఫేర్ డిడి పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లకు సంబంధించి నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ ఉన్న బకాయిలు మే నెలలో జమ అవ్వడం జరుగుతుందని, వెంటనే నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతం రోజుకు 65,000 మంది కూలీలు పనులకు రావడం జరుగుతోందని, ప్రతిరోజు లక్ష మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ సరోవర్ పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్ కు సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ లు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా గడువులోపు పరిష్కరించాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన సమస్యలను ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీ చేసే సంపూర్ణ పోషణ కిట్లు నాణ్యతగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. సంబంధిత సిడిపివోలు, సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్లతో ఐసిడిఎస్ పిడి లక్ష్మీ కుమారి వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలనిఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలను మరింత బలోపేతం చేయాలన్నారు. మే 10వ తేదీలోపు పురోగతి చూపించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. మనబడి నాడు నేడు కింద పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి పెండింగ్ లేకుండా సకాలంలో పంపిణీ చేయాలన్నారు.* మడకశిర, అమడుగురు, కదిరి, నల్లమాడ, కొన్ని అభివృద్ధి పనులలో వెనకబడి ఉన్నాయని వాటిని మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు ఆదేశించారు. సంక్షేమ పథకాలలో అమలు చేయడంలో ఎంపీడీవో కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో పురోగతి చూపించాలన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు భాగ్య రేఖ, తిప్పే నాయక్, రాఘవేంద్ర, సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమోహన్ రెడ్డి, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, డిపిఓ విజయ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డ్వామా పిడి రామాంజనేయులు, మెప్మా పిడి విజయలక్ష్మి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఇన్చార్జి డిఈఓ మీనాక్షి, డిఎల్డివో శివారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment