అర్జీదారుల సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి..



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


.. అర్జీదారుల సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి..



..  ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా సంబందిత శాఖాధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించారు. 


.. జిల్లా డా.కే.మాధవీలత


ప్రజా సమస్యల  పరిష్కార వేధిక   "స్పందన"   కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీదారులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను  పూర్తి స్థాయిలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా డా.కే.మాధవీలత అధికారులను ఆదేశించారు.


సోమవారం  స్థానిక కలెక్టరేట్  సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాధవీలత, జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ తోకలసి ప్రజల నుంచి 164 అర్జీలను స్వీకరించారు.   ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ  ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి శాఖకు సంబందించిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల వారి పరిధిలోని అర్జీలను వేగవతంగా పరిష్కరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీ-ఓపెన్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుతాం దరఖాస్తులపై పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఎ.పి సేవ పోర్టల్లో ఉన్న పెండింగ్ దరఖాస్థులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 14 వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని కొవ్వూరు పట్టణంలో పర్యటించనున్న దృష్ట్యా అధికారులు సమన్వయంతో వారికి కేటాయించిన విధులును  ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా సక్రమంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి తగినన్ని మందులు, బీపీ మిషన్, ఓఆర్ఎస్ ప్యాకేట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. 


జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచుకొని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో స్వీకరించే ప్రతి దరఖాస్తును 24 గంటల్లో ఓపెన్ చేసి పరిష్కరించడమా లేదా తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని తిరస్కరించదలిస్తే సరైన కారణాలు తెలపాలన్నారు. 

కార్యక్రమంలో  డీఆర్వో  జి.  నరశింహులు, రీజనల్ మేనేజరు (టూరిజం) వి.స్వామినాయుడు,  డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ కె.ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,   గిరిజన సంక్షేమ అధికారి కే. జ్యోతి , డి ఎల్ డిఓ  పి. వీణాదేవి, డీఎస్ఓ పి. ప్రసాదరావు, సివిల్ సప్లై జిల్లామేనేజరు ఏ. కుమార్, బీసీ సంక్షేమాధికారి రమేష్  పలువురు జిల్లా శాఖా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


Comments