వెనిగండ్ల రాము ఎంట్రీతో వేలాదిగా కదిలొచ్చిన జనం

 *- వెనిగండ్ల రాము ఎంట్రీతో వేలాదిగా కదిలొచ్చిన జనం


 *- "ఇంటింటికీ తెలుగుదేశం"తో దద్దరిల్లిన గుడివాడ రైల్వే స్టేషన్ రోడ్డు* 

 *- అడుగడుగునా హారతులిస్తూ మహిళల ఘనస్వాగతం* 

 *- ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకున్న వెనిగండ్ల* 



గుడివాడ, ఏప్రిల్ 3 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము ఎంట్రీతో కృష్ణాజిల్లా గుడివాడలో వేలాదిగా జనం కదిలొచ్చారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు దద్దరిల్లిపోయింది. అడుగడుగునా వెనిగండ్ల రాముకు హారతులిస్తూ మహిళలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు పెద్దఎత్తున వెనిగండ్ల రాముపై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలందించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో మమేకమవుతూనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల కిందట గుడివాడ పట్టణంలోని గుడ్ మెన్ పేటలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. గుడ్ మెన్ పేట ప్రజలంతా తరలివచ్చి వెనిగండ్ల రాముకు బ్రహ్మరథం పట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా రైల్వే స్టేషన్ రోడ్డులో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అంతకు మించిన స్థాయిలో ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మాత్రమే వెనిగండ్ల రాము పరిమితం కావడం లేదు. అధికారంలో లేకున్నా తనదైన శైలిలో కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించేస్తున్నారు. గుడివాడలో పుట్టానని, ఇక్కడే పెరిగానని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని చెబుతూ వస్తున్న వెనిగండ్ల రాము తన ఫౌండేషన్ ద్వారా గత నాలుగైదు నెలలుగా విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తూ, ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ కళ్ళజోళ్ళను సైతం అందిస్తున్నారు. మెగా జాబ్ మేళా నిర్వహించి దాదాపు 2వేల మంది యువతకు ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలను కూడా కల్పించారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇంటికి వెళ్ళి మరీ పరామర్శిస్తూ పార్టీ రహితంగా తనవంతు సాయం చేస్తూ వస్తున్నారు. దురదృష్టవశాత్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారికి సైతం వెనిగండ్ల రాము అండగా నిలబడుతున్నారు. ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు రాజకీయాల ద్వారా కూడా విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు ఆదేశాల మేరకు పేదప్రజల ఆకలిని తీర్చేందుకు గుడివాడలో అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వెనిగండ్ల రాము ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు. ఇలా నాలుగైదు నెలలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలతో వెనిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో దగ్గరైపోయారు. ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివస్తూ వెనిగండ్ల రాము కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము నిర్వహిస్తున్న సేవా, పార్టీ కార్యక్రమాలకు ప్రజల ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకునే విషయంలో వెనిగండ్ల రాము ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుడివాడ రాజకీయాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళడంలో వెనిగండ్ల రాము మిగతా వారి కంటే ఒక అడుగు ముందే ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. పేదలకు సేవ చేయడం, సాయం అందించడం, ఆదుకోవడం, బాధ్యత తీసుకోవడం, అండగా నిలబడడం వంటి విషయాల్లో వెనిగండ్ల రాముతో సరితూగడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

Comments