ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న.. జిల్లాలో శనివారం పర్యటన



రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న.. జిల్లాలో శనివారం పర్యటన



మండుటెండలో కలెక్టర్ ఇతర అధికారులతో పర్యటన 


జాం పేట, ఆజాద్ చౌ క్ సమీపంలో పాత పోలీస్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతాన్ని కలెక్టరేట్ నిర్మాణం కోసం  (స్వామీ ధియాటర్ వద్ద)  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లాలో శాశ్వత కలెక్టరేట్, ఇతర శాఖలకు చెందిన భవనాలు నిర్మాణం కోసం ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలియ చేశారు. సుమారు 7.9 ఎకరాల భూమి ఇక్కడ అందుబాటులో ఉందని తెలియచేశారు. నగరం లో కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలియచేశారు. 


తొలుత కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెన వద్ద ఇటీవల జరిగిన మరమ్మతుల పనులను పరిశీలించారు. ఇప్పటికే నిర్మాణం జరిగి 50 సంవత్సరాలు దాటిన సందర్భంగా చేపట్టవలసిన పనుల వివరాలను అధికారులు వివరించారు. 


అనంతరం నగరంలో ప్రతిష్ఠత్మకంగా చేపట్టనున్న మోరంపూడి పైవంతెన నిర్మాణం పనులు పరిశీలన చేశారు. అక్కడ నిర్మాణ పనులను చేపడుతున్న కంపనీ ప్రతినిధులతో పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.  సాధ్యమైనంత తొందరలో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


తొలుత  కొవ్వూరు వైపు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద  జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్  కె. దినేష్ కుమార్ లు ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న కు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు.


ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న 

పర్యటన లో జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్  కె. దినేష్ కుమార్,  ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, ఆర్ అండ్ బి అధికారులు ఎస్ ఈ హరి ప్రసాద్, ఈ ఈ ఎస్బివి రెడ్డి, డి ఈ  బివివి మధుసూధన్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Comments