సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు.

 *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి141 వ జయంతి సందర్భంగా*


 *గరిడేపల్లి మండల హెడ్ కోటర్స్ నందు 14న సమాచార హక్కుపై అవగాహన సదస్సు* 


 *సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు* 


      

     -ఆర్టిఐ అసోసియేషన్ (ఆర్ ఏ ఏ) సూర్యాపేట జిల్లా కన్వీనర్  బరిగెల విజయకుమార్ బహుజన్;


గరిడేపల్లి  (ప్రజా అమరావతి): బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14 న సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీఐ  సమాచార హక్కు చట్టం 2005  ప్రచార కార్యకర్త బరిగెల విజయ్ కుమార్ బహుజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం  వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ జి ముత్తు గారి ఆదేశానుసారం ఆర్టిఐ కార్యకర్తల సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ గార్ల నేతృత్వంలో గరిడేపల్లి మండలంలోని మండల హెడ్ కోటర్స్ మెయిన్ సెంటర్ కల్మలచెరువు రోడ్డు మెయిన్ సెంటర్ లో  ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సదస్సు జరుగుతుందన్నారు. సమాచార హక్కు చట్టం -2005 గురించి వివరిస్తారని చెప్పారు. కావున ఇట్టి కార్యక్రమానికి గరిడేపల్లి మండల పరిధిలోని ఉద్యోగులు రాజకీయ నాయకులు విద్యావంతులు మేధావులు అన్ని గ్రామాలలోని విద్యావంతులై చైతన్యవంతులైన యువతి యువకులు అత్యధిక శాతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సమాచార హక్కు చట్టంకార్యకర్తల సంఘం సూర్యాపేట జిల్లా కన్వీనర్ బరిగెల విజయకుమార్ బహుజన్ కోరారు.

Comments