నెల్లూరు ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి);
శంకుస్థాపన చేసిన ప్రతి పనికి నిధులు కేటాయించడం, పనులు పూర్తి చేసి ప్రారంభించడం
అనే ప్రక్రియ ప్రస్తుత ప్రభుత్వ విధానమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజక వర్గంలోని టి పి గూడూరు మండలం పేడూరు పంచాయతీ పరిధిలోని కొలిదిబ్బ గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
తోలుత కొలిదిబ్బ గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కాకాణి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమఫలాలు అందుతున్న వైనం తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు
ఈ సందర్బంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామాల్లో పర్యటనల సందర్బంలో మౌలిక వసతులు కరువైన పరిస్థితులు కన్పించేవని, నేడు గ్రామాల కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మాణంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కొలిదిబ్బ గ్రామానికి వచ్చే ప్రధాన రోడ్డును 50 లక్షల రూపాయలతో, అదేవిధంగా గ్రామంలోని అంతర్గత రోడ్లకు 85 లక్షల నిధులు వెచ్చించి పూర్తిచేసి ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా ప్రతి పనికి నిధులు కేటాయించి, పూర్తి చేసి ప్రారంభించడం అనే ప్రక్రియ ప్రభుత్వ విధానమన్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా వివిధ వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని భారతదేశానికే తలమానికంగా నిలిపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో యం పి డి ఓ హేమలత, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment