ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటు స్టిక్కర్లు అంటించాలి
బిజెపి, వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై
14 నుండి వామపక్షాల ప్రచారబాట
కాకినాడ, ఏప్రిల్13 (ప్రజా అమరావతి): దేశ, రాష్ట్రంలో పాలిస్తున్న బిజెపి, వైసిపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు ప్రచార భేరి నిర్వహిస్తున్నట్లు గురువారం సుందరయ్య భవన్లో ప్రచార భేరి పోస్టర్లను వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఎం జిల్లా
కన్వీనర్ ఎం రాజశేఖర్
మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందాయని, బిజెపి కార్పొరేట్ మతోన్మాదం విధానాలను ప్రజలలో ఎండగట్టాలని దేశాన్ని మొత్తం ఆదాని వారికి అప్పజెప్పడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అదానీ గ్రూపు వారికే దారాదత్త చేయడం చూస్తున్నామని, మరోవైపు అధిక ధరలు, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగేలా చేసిందన్నారు. ప్రైవేటీకరణ, జీఎస్టీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఒకవైపున మతోన్మాదం పేరుతో హింసను పెంచుతున్నారన్నారు. మతమార్పిడులు మైనార్టీలపైనా, దళితులపై దాడులు అధికమయ్యాయని మధు, రాజశేఖర్లు తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలలో ఎండగట్టాలని, పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలను అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, రాజధాని నిర్మాణం జరగాలని, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పాలిస్తున్న సీఎం జగన్ ప్రజల కష్టనష్టాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతూ ఆర్థిక ఇబ్బందులకు పాలు చేస్తున్నారని రాష్ట్రంలో భూ, ఇసుక, లిక్కర్ మాఫియా కొనసాగుతున్నదని, ఉద్యమాల నిర్వహించడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ ఒకటి తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రశ్నించే వాడే ఉండకూడదనే విధంగా జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గమని తెలిపారు. వీటన్నిటిపై ఏప్రిల్ 14 నుంచి 30వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న నోరు మెదపలేదని రాజశేఖర్, మధులు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఎం సీనియర్ నాయకులు దువ్వ శేషుబాబ్జి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..
addComments
Post a Comment