*ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి*
*: కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి):
వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని పుట్టపర్తిలో ఉన్న ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్దనున్న డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, అగ్రికల్చర్, తదితర కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను సావధానంగా విని వాటికి నాణ్యత కలిగిన పరిష్కారం చూపించాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించేలా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని, సిబ్బంది కూడా సమయవేళలు పాటించేలా చూడాలన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిసరాలలో శుభ్రత పాటించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారు, తదితర అంశాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, ఆర్డీఓ భాగ్యరేఖ, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment