విజయవాడ (ప్రజా అమరావతి);
ప్రభుత్వ అంధుల మరియు బధిరుల ఆశ్రమ పాఠశాలల మరియు ప్రభుత్వ బధిరుల జూనియర్ కళాశాలల యందు ప్రవేశం కొరకు 2023-24 విద్యా సంవత్సరమునకు అర్హత గల అంధ మరియు బధిరుల బాల బాలికల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు శ్రీ బి. రవి ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో 3 అంధులు, 3 బధిరుల ఆశ్రమ పాఠశాలలు ఒక ప్రభుత్వ బధిరుల జూనియర్ కళాశాలలో 497 సీట్లు అందుబాటులోనికి తెచ్చామన్నారు. 1 నుండి 12 తరగతుల కొరకు ఆయా పాఠశాలల్లో దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. ఆయా బాలబాలికలు విద్యా సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. విద్యార్థులు పాఠశాలలో చదవడానికి 5 సంవత్సరాలు వయస్సు పైబడి ఉండి ఆధార్ కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం తో 3 పాస్ పోర్టు సైజు ఫోటోలు జతచేసి తమ వ్యక్తిగత దరఖాస్తులను ఆయా పాఠశాలలకు పంపవలసి ఉంటుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఎన్నో విలువైన సేవలను ఉచితంగా అందించడం జరుగుతున్నదని చెబుతూ వాటిని అర్హత గల వారందరూ తప్పక వినియోగించుకోవాలని సంచాలకులు విజ్ఞప్తి చేసారు. ఈ పాఠశాలలో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలూ, నోట్ రైటింగ్ బుక్స్, స్కూల్ డ్రెస్, ఉచిత భోజనం, వైద్యం, వసతి, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి అంశాలతో ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించి అంధ బధిరుల విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడానికి విద్యను అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా విద్యార్థినీ విద్యార్థులకు బ్రైయిలీ లిపి మరియు సాంకేతిక బాష నేర్పించడం జరుగుతుందని ఇవి విద్యార్థినీ విద్యార్థుల భవితను తీర్చిదిద్దంలో తోడ్పాటు అందించగలదని శ్రీ రవి ప్రకాష్ రెడ్డి అన్నారు.
విజయనగరం అందుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకూ 41 ఖాళీలు ఉండగా వివరాలు 9494914959, 8317548039 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
విశాఖపట్నం అందుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకూ 46 ఖాళీలు ఉండగా వివరాలు 9494914959, 9014456753 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
హిందూపురం అందుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకూ 93 ఖాళీలు ఉండగా వివరాలు 7702227917, 7780524716 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
విజయనగరం బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకూ 15 ఖాళీలు ఉండగా వివరాలు 9440437628, 9000013640 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
బాపట్ల బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకూ 150 ఖాళీలు ఉండగా వివరాలు 9491795728, 9949004094 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
ఒంగోలు బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకూ 127 ఖాళీలు ఉండగా వివరాలు 9441943071, 9985837919 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
బాపట్ల బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు బాలికలకు 25 ఖాళీలు ఉండగా వివరాలు 9491795728, 9949004094 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి పొందాలని చెప్పారు.
అర్హత గల విద్యార్థులు నిర్దేశించిన విధంగా దరఖాస్తులు చేసుకోవాలని సంచాలకులు శ్రీ బి. రవి ప్రకాష్ రెడ్డి తెలియజేసారు.
addComments
Post a Comment