నెల్లూరు (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో సహకార బ్యాంకుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు
అందించడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాణాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెంలోని వవ్వెరు కో ఆపరేటివ్ రూరల్ బ్యాంకును సందర్శించి, బ్యాంకు కార్యకాలాపాలను గురించి పాలకవర్గ సభ్యులను అడిగితెలుసుకున్నారు. ఈ సంధర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, బుచ్చిరెడ్డిపాలెం వవ్వెరు కో- ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఎంతో చరిత్ర కలిగిన బ్యాంకు అని, కో ఆపరేటివ్ రంగంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2వ స్థానంలోను, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో వవ్వెరు కో ఆపరేటివ్ రూరల్ బ్యాంకు నిలిచిందన్నారు. డిపాజిట్ల సేకరణలో గాని, షేర్ కాపిటల్ గాని, రుణాల మంజూరులో గాని అన్నీ రంగాల్లో ఈ బ్యాంకు ముందజలో వుండటం సంతోషకరమని మంత్రి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం లోని కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు, వవ్వెరు కో ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ రెండు బ్యాంకులు రైతాంగానికి సేవలందించడంలో ముందు వరుసలో ఉండటం ఆనందించాల్సిన విషయమన్నారు. ముఖ్యంగా కో ఆపరేటివ్ రంగానికి సంబందించి బ్యాంకులు ఎప్పుడైతే ఆరోగ్యకరంగా, బలంగా వుంటాయో రైతాంగానికి గాని ఇతర వర్గాల వారికి సేవచేసే అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో బలహీనంగా ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకులకు గాని, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలకు కాపిటల్ ఇంక్లూజన్ కింద 295 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో, ఈ రోజు వున్నటువంటి 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. కో ఆపరేటివ్ రంగం రైతాంగానికి, మహిళా గ్రూపులకు సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడంతో ఎక్కువ వడ్డీ తో రుణాలు ఇచ్చే కమర్షియల్ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీతో నేడు రైతులకు, కౌలు రైతులకు, మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. వ్యవసాయ పంటలకు గాని, ఉద్యాన పంటలకు గాని, వాణిజ్య పంటలకు సంబంధించి రైతాంగానికి అండదండలు వుంటూ ఆర్ధిక వనరులు అందించే వెసులుబాటు నేడు కో ఆపరేటివ్ బ్యాంకులకు కలిగిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో అన్నీ బ్యాంకులకు ఏవిధంగా నైతే ప్రోత్సాహం, సహకారం అందిస్తామో అదేవిధంగా స్థానికీ శాసన సభ్యుల ఆలోచనల మేరకు వవ్వెరు కో ఆపరేటివ్ రూరల్ బ్యాంకుకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందించి, ఈ బ్యాంకు ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖాధికారి శ్రీమతి సుధా భారతి, డివిజనల్ సహకార శాఖాధికారి శ్రీ తిరుపాల్ రెడ్డి, తహసిల్ధార్ శ్రీ సుధీర్, వవ్వెరు కో ఆపరేటివ్ రూరల్ బ్యాంకు పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
addComments
Post a Comment