రెడ్ల ఐక్య చైతన్య యాత్రలో సంఘం దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల దృష్టికి తీసుకెళ్లిన ఏపీ రెడ్డి సంఘం నేతలు..

 *రెడ్ల ఐక్య చైతన్య యాత్రలో సంఘం దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల దృష్టికి తీసుకెళ్లిన ఏపీ రెడ్డి సంఘం నేతలు..*


*సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి..* 

తాడేపల్లి (ప్రజా అమరావతి);

 మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులతో కలిసి వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నా "రెడ్ల ఐక్య చైతన్య యాత్ర"  గురించి వివరించారు, అదేవిధంగా  యాత్రలో సంఘం దృష్టికి వచ్చిన కొన్ని రెడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందులో రెడ్డి యువతకు, రెడ్డి పేదలకు రెడ్డి వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయాలి, జలకళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బోర్లు వేసింది అయితే వాటికి మీటర్లు బిగించడం లేదు. తమ భూమిలో నీళ్లు ఉన్నా రైతులు పంటలు వేయలేకపోతున్నారు, రైతులకు తార్బన్ పట్టలు, తైవాన్ పంపులు, స్ప్రేలు సబ్సిడీలో అందించాలి అని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రతినిధులతో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మీరు సూచించిన సమస్యలకు  త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు.అలగే "రెడ్ల ఐక్య చైతన్య యాత్ర" నిర్వహిస్తున్న సంఘం ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తో సమావేశం తదనంతరం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ల  ఐక్య చైతన్య యాత్ర ద్వారా మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి రెడ్లను కలుస్తున్నాము వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతున్నది. వాటితోపాటు స్థానిక - ప్రాంతీయ రెడ్డి సంఘాలను కలుస్తూ ముందుకు పోవడం జరుగుతున్నది. రెడ్ల ఐక్య చైతన్య యాత్రలో సంఘం దృష్టికి వచ్చే సమస్యలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేస్తాము. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకు, హోదాలకు అతీతంగా జరుగుతున్న "రెడ్ల ఐక్య చైతన్య యాత్రలో" రెడ్డి కులస్తులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు పులుగు సుశీల రెడ్డి,  శ్రీ రెడ్డి, ప్రచార కార్యదర్శి రమణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉమాపతి రెడ్డి, కార్యదర్శి గజ్జల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, సహాయ కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments