గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి “టార్గెట్ వెనిగండ్ల"

 *- గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి “టార్గెట్ వెనిగండ్ల"* 


 *- బలమైన వర్గాన్ని వెనిగండ్ల లాగేసినట్టుగా ప్రచారం* 

 *- టీడీపీలోనూ విస్తృతంగా వెనిగండ్ల కార్యక్రమాలు* 

 *- అన్నా క్యాంటీన్ల దిగ్విజయంతో పెరిగిన దూకుడు* 

 *- పేదల కోసం రూ. లక్షల ఖర్చుకూ వెనుకాడని వెనిగండ్ల* 

 *- చంద్రబాబు పర్యటన తర్వాత వెనిగండ్ల శిబిరంలో నూతనోత్సాహం* 



గుడివాడ, ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ వెనిగండ్ల రాము అన్నట్టుగా ఉంది. చంద్రబాబు గుడివాడ పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం అర్ధమైందో కానీ వెనిగండ్లపై విమర్శల బాణాలను వదిలిపెడుతూ వస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన వెనిగండ్ల ఏప్రిల్ లో సీనియర్ టీడీపీ నేత అయిపోయారంటూ విరుచుకుపడుతున్నారు. అలాగే తాజాగా వెనిగండ్లను గుడివాడ టీడీపీ కన్వీనర్ అంటూ పత్రికా ప్రకటన రావడాన్ని కూడా వైసీపీ నేతలు ప్రస్తావించడం జరిగింది. అంతేగాక దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను తొక్కేసి ఏదో చేద్దామనుకుంటున్న వెనిగండ్లను తరిమికొడతామంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు చేశారు. ఇంతగా వెనిగండ్ల టార్గెట్ కావడానికి కారణాలనేకం ఉన్నాయన్నది ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో చర్చగా మారింది. వెనిగండ్ల వచ్చీరావడంతోనే గుడివాడ నియోజకవర్గంలోని ఒక బలమైన వర్గాన్ని తనవైపు లాగేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలోనూ వెనిగండ్ల విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మరోవైపు సేవాకార్యక్రమాలతో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యే పనిలో వెనిగండ్ల నిమగ్నమవడం ప్రత్యర్ధులకు మింగుడు పడడం లేదు. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కూడా గుడివాడలో వెనిగండ్ల రాము పునరుద్ధరించారు. నిత్యం వందలాది మంది పేదప్రజల ఆకలిని ఈ అన్నా క్యాంటీన్లు తీరుస్తున్నాయి. అన్నా క్యాంటీన్లను పేద ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటుండడంతో తెలుగుదేశం పార్టీలో వెనిగండ్ల తన దూకుడును పెంచుతూ వస్తున్నారు. పేదప్రజల కోసం రూ. లక్షలు ఖర్చు చేసేందుకు కూడా వెనిగండ్ల వెనకాడడం లేదు. మెగా జాబ్ మేళా నిర్వహించి గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 1500 మంది నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో వెనిగండ్ల ఉద్యోగాలను కల్పించారు. ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తూ వస్తున్నారు. దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదాల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని తన సేవలతో కవర్ చేయాలనే లక్ష్యంతో వెనిగండ్ల తన సేవా కార్యక్రమాలను రూపొందించుకుని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు రెండు రోజుల గుడివాడ పర్యటనలో వెనిగండ్ల మార్క్ రాజకీయం అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొద్ది నెలలుగా గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు ప్రత్యక్షంగా చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. దీంతో వెనిగండ్ల శిబిరంలో నూతనోత్సాహం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు కూడా వెనిగండ్లను రాజకీయంగా టార్గెట్ చేసే పనిలో నిమగ్నమైనట్టుగా గుడివాడ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. వెనిగండ్ల రాము కూడా ప్రత్యర్ధుల టార్గెట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Comments