మత సామరస్యానికి ప్రతీక రంజాన్ !! --- కలెక్టర్ పి. రాజాబాబు


 

 మచిలీపట్నం : ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి);


*మత  సామరస్యానికి ప్రతీక రంజాన్  !!*


     *--- కలెక్టర్ పి. రాజాబాబు*



 పవిత్ర రంజాన్‌ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు.


 జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు , ఆర్డీవో ఐ. కిషోర్, మచిలీపట్నం తహసిల్దార్ సునీల్ బాబు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి షమ్ సున్నీసా బేగం,మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), జామియా మసీద్ ఇమామ్ రఫీక్ ఆలం, మచిలీపట్నంలోని వివిధ మసీదుల కమిటీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మౌలానాలు ఖురాన్‌ పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రంజాన్‌ మాసం విశిష్టతపై పలువురు వక్తలు ఉపన్యసించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్‌  పి.రాజాబాబు మాట్లాడుతూ, దైవారాధన, ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దాతృత్వానికి రంజాన్‌ మాసం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు సోదరభావం, ప్రేమను పెంపొందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు.


*ముస్లిం మైనార్టీలకు పెద్దపీట..* 

       

 మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. దివంగత నేత వైఎస్సార్‌ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, అదేబాటలో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు నాలుగు ఎమ్మెల్యేలు, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ముస్లింలకు ఇచ్చారన్నారు. అలాగే శానసమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవిని ముస్లిం మహిళకు ఇచ్చి గౌరవించారన్నారు. ఇక మేయర్‌, జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు..ఇలా అనేక పదవులను ముస్లింలకు ఇచ్చి సాధికారిత కల్పించారని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు


Comments