ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా.బిఆర్.అంబేద్కర్

*

*: డా.బిఆర్.అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి*

*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*

పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి):

*భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బిఆర్.అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 132వ జయంతి మహోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, డిఆర్ఓ కొండయ్య, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్ తదితరులు డా.బిఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు.*

*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి.. పాఠశాలలో చిన్న వయసులోనే వివక్షను ఎదుర్కొని.. ఏనాడు వాటిని లెక్క చేయకుండా చాలా కష్టపడి చదువుకొని ప్రపంచంలో గర్వించదగ్గ మేధావిగా డా.బిఆర్.అంబేద్కర్ నిలిచారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన మనోధైర్యం కోల్పోలేదని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పేదరికం ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా చదువు లేకపోతే జీవితం ఎంతో కష్టమని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అంబేద్కర్ జీవితం సందేశం ఇస్తోందన్నారు. డా.బిఆర్.అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలన్నారు. పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి చదువు, పట్టుదల, క్రమశిక్షణతో డా.బిఆర్.అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో నడవాలన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలో ఆగిపోగా పలువురు అందించిన ప్రోత్సాహంతో ఇతర దేశాలకు వెళ్లి బాగా చదువుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చి అంబేద్కర్ సేవలను అందించారన్నారు. డా.బిఆర్.అంబేద్కర్ గొప్ప దేశభక్తుడని, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేశాన్ని గౌరవించారన్నారు. తర్వాత కాలంలో డా.బిఆర్.అంబేద్కర్ వివిధ పదవులు అలంకరించి పదవులకు వన్నె తీసుకువచ్చారన్నారు. వివిధ ఉద్యమాలను నడిపారని, ఆరోజు సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అందరిలో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు. అంబేద్కర్ ఆశయాల గుణగుణంగా ప్రభుత్వం కూడా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తోందని, విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య తదితర కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఆయా పథకాలను సద్వినియోగం చేసుకునే జీవితంలో అభివృద్ధి చెందాలన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు.*

అంబేద్కర్ జీవిత  చరిత్రను, క్లుప్తంగా వివరించిన బేబీ  భావనను ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలోఆర్డీవో భాగ్యరేఖ,  పుట్టపర్తి మున్సిపల,వైస్ చైర్మన్  తిప్పన్న, పూడ  చైర్మన్ లక్ష్మినరసమ్మ ,  పుట్టపర్తి రూరల్ ఎంపీటీసీ రమణారెడ్డి, బేకరీ గంగాధర్, పి నరసింహులు, రవి నాయక్, నరసింహులు, శంకర్, కమిటీ సభ్యులు శ్రీనివాసులు గంగలయ్య వీరనారాయణ. వెంకటేశు, పరమేశు, రామాంజనేయులు, వెంకట్ రాయుడు, జగదీష్

తదితరులు పాల్గొన్నారు

  డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి.

ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా.బిఆర్.అంబేద్కర్*

Comments