కడప జిల్లా (ప్రజా అమరావతి);
_*కడపలో జరిగిన జోన్-5 సమావేశంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడి ప్రసంగం వివరాలు...*_
*వివేకానందరెడ్డి మర్డర్ పెద్దకేస్ స్టడీ. హత్యలుచేయడం, కేసులు లేకుండా తప్పించుకోవాలనిచూస్తున్నవారిని ప్రజాకోర్టులో శిక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వివేకాను చంపినవారికి ఎప్పటికైనా శిక్షతప్పదు. బాబాయ్ ని చంపినవారు ప్రజల భవిష్యత్ కు ఆశాజ్యోతులా? హత్యచేసినవారిని విచారణకుపిలిస్తే శాంతియుత ర్యాలీలుచేస్తారా? మీరు చేయాల్సింది శవర్యాలీలు.*
*- జగనే రాష్ట్రదరిద్రం, ప్రజలపాలిట సైతాన్. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నభూతం.
ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కుళ్లపేరుతో బొక్కుతున్నాడు.*
*- జగన్, అతని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి రూ.4లక్షలకోట్లు, 4ఏళ్లలో ప్రజలపై వేసిన పన్నులుభారం రూ.5లక్షలకోట్లు, చేసిన అప్పులు రూ.10లక్షలకోట్లు. ఈసొమ్మంతా ఎవరిజేబుల్లోకి పోయింది. రాష్ట్రంలో అప్పులేని మనిషి, కుటుంబమే లేదు.*
• ఈరోజు జరిగిన సమావేశంలో నియోజకవర్గాల్లో బాగాపనిచేసిన వారితో మాట్లాడించాను. ఎవరైతే పార్టీకోసం బాగాపనిచేస్తున్నారో వారికే గుర్తింపు రావాలి. అప్పుడే మిగతావారు ఉత్సాహంతో బాగాపనిచేస్తారు. బాగాపనిచేసేవారే నాకుదగ్గరగా ఉంటారు. మాటలు చెప్పే వాళ్లను మొహమాటానికి కూడా దగ్గరకు రానివ్వను. ఈ ప్రభుత్వనిర్వాకంతో ఇబ్బందులు, బాధలుపడేవారికి భరోసా ఇవ్వాలి. కష్టంలో ఉన్న వాడికి తెలుగుదేశం జెండా భరోసాగా నిలవాలి. 100కుటుంబాలకు ఒక పురు షుడు, మహిళ అందుబాటులో ఉండాలి. వారే కుటుంబసారథులు. వారే భవిష్యత్ లో తెలుగుదేశంపార్టీ సైన్యంగా పనిచేస్తారు.
• గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్ గోపాల్ రెడ్డి పనిచేసిన విధానం చాలా గ్రేట్. అసాధ్యమనుకున్నదాన్ని సాధ్యంచేసిన వ్యక్తి రామ్ గోపాల్ రెడ్డి. ఎప్పుడూ గెలవలే దు అనుకున్ననియోజకవర్గాన్ని కూడా గెలవగలమని రామ్ గోపాల్ రెడ్డి, ఇక్కడి టీ డీపీ నేతలు నిరూపించారు. వైనాట్ పులివెందులను కూడా సాధ్యంచేయొచ్చు. గెలు పు ఎప్పుడూ ఒకకిక్, జోష్ ని ఇస్తుంది. రాయలసీమలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీస్థానాలు, ఉత్తరాంధ్రలో ఒకటిగెలిచి 108 నియోజకవర్గాల్లో టీడీపీ బ్రహ్మండంగా ముందుకుపోతోంది.
• ఈ ప్రభుత్వం వచ్చి 4ఏళ్లు అయ్యింది. ప్రజల్ని ఇబ్బందిపెడుతూ, ప్రజాహంతకపాలన తో ముందుకుపోతోంది. దేశంలో ఎక్కడాలేని ధరలు ఈరాష్ట్రంలోనే ఉన్నాయి. గ్రామ గ్రామాన బాదుడేబాదుడు కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాము. బియ్యం నుంచి వంటనూనెలు, పప్పులధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కువధరకు ఏపీలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ అమ్ముతున్నారు. ఈ మూడుసామాన్యప్రజానీకానికి చాలాచాలా అవసరం. అవేకాకుండా ప్రజలపై ఆర్టీసీఛార్జీలభారం, విద్యుత్ ఛార్జీలు, ఇంటిపన్నుతోపాటు, ఆఖకిరి చెత్తపైకూడా పన్నువేసిన చెత్తప్రభుత్వం ఈ ప్రభుత్వం.
• ఇసుకను టీడీపీప్రభుత్వం ఉచితంగా ఇస్తే విమర్శించిన దొంగలు, ఇప్పుడు 40లక్షల మంది కార్మికులకు తిండిలేకుండా చేసి రోడ్డునపడేశారు. ఇసుకతోపాటు, సిమెంట్ , ఇనుమును కూడా సిండికేట్ చేశారు. ఎక్కడికక్కడ భవననిర్మాణాలు నిలిచిపోయాయి.
• మరోపక్క మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా అంతా ప్రభుత్వమే చేస్తోంది. మద్య పాన నిషేధం అనిచెప్పిన వ్యక్తి మద్యంఅమ్మకాలపై వచ్చే సొమ్ముని తాకట్టుపెట్టి అ ప్పులు తెచ్చాడు. పేదలు పగలంతా కష్టపడి, సాయంత్రానికి ఒక క్వార్టర్ కొనాలంటే జేబులు, ఒళ్లు గుల్లచేసుకోవాల్సిన పరిస్థితి. అవినీతికి కక్కుర్తిపడి ప్రజాజీవితాల్ని నా శనంచేస్తున్నారు.
• రాష్ట్రంలో ఏ కుటుంబం ఆనందంగా లేదు. ప్రతిరోజూ బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి, బటన్ బొక్కడుతో ఎంతతింటున్నాడో సమాధానంచెప్పాలి. జగన్ అవినీతి ఈ4ఏళ్లల్లో రూ.2లక్షలకోట్లు, అతని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి మరో రూ.2లక్షలకోట్లు. రాష్ట్రంలో ప్రజలపైవేసిన పన్నులభారం రూ.5లక్షలకోట్లు, మీరుచేసిన అప్పులు రూ.10లక్షలకోట్లు. ఈ డబ్బంతా ఎవరిజేబుల్లోకి పోయింది? ఈ విధంగా దోచేసి పేద లపై భారంవేశారా లేదా? ఇదేవిషయం ప్రతికుటుంబానికి అర్థమయ్యేలా చెప్పాలి.
• రాష్ట్రంలో అప్పులేని మనిషి, కుటుంబం ఉందా? ప్రతిఒక్కరి జీవనప్రమాణాలు పడిపో యి, ప్రతి కుటుంబం అప్పులపాలైంది. మరోపక్క ఎటుచూసినా నేరాలు-ఘోరాలు.
• మాజీముఖ్యమంత్రి సోదరుడు, మాజీఎంపీ, మాజీఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన్న అయిన వివేకానందరెడ్డిని ఏంచేశారు? ప్రపంచానికే ఈ వ్యవహారం ఒక పెద్ద మిస్టరీ. ఇలాంటిదారుణం ప్రపంచంలో ఎక్కడాజరిగి ఉండదు.హత్యజరిగిన నాడు గుండెపోటు అన్నారు. తరువాత రక్తపువాంతులని చెప్పారు. చనిపోయిన వ్యక్తి కూ తురు పోస్ట్ మార్టమ్ చేయాలంటే, అక్కడినుంచి నారాసుర రక్తచరిత్ర అని నాపై వేసి తప్పించుకోవాలని కుఠిలరాజకీయాలు చేశారు. ఆ సంస్కృతి పులివెందులనుంచే ప్రారంభమైంది.
• అక్కడినుంచి రాష్ట్రపోలీస్ విచారణపై నమ్మకంలేదన్నారు. కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సీబీఐ విచారణ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. చివరకు సొంత కుటుంబసభ్యుల్నే మాయమాటలతో మోసపుచ్చారు. ఊసరవెల్లిని మించి రంగులు మార్చారు. ఎన్నికల్లో గెలవడానికి నాకు నాన్నలేడు..ఉన్నచిన్నాన్నను కూడా చం పేశారు అని నాటకాలుఆడాడు. కోడికత్తి డ్రామా ఆడాడు. అంతాచేసిఎన్నికల్లో గెలిచా క సీబీఐ విచారణకావాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కుతీసుకున్నారు. వివేకా కూతురు మాత్రం చనిపోయినవ్యక్తులు ఎవరో తేలేవరకు రాజీలేని పోరాటం చేస్తానని ముందుకెళ్లింది. ఆమెధైర్యాన్ని అభినందిస్తున్నాను.
• సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి సెషన్స్ కోర్టు వరకు ఈ కేసులో ఎన్నిదారులుంటే అన్నిదారుల్ని వాడుతున్నారు. ఈ కేసుని ఎక్కడికి తీసుకుపోతున్నారు. దోషుల్ని కాపాడటానికి, అధికారంతో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. మీరే చంపి, మీరే వేరేవారిపై నేరారోపణలు చేశారు. ఈరోజుకాకపోతే రేపు అయినా తప్పుచేసిన వారికి శిక్షపడక తప్పదని హెచ్చరిస్తున్నాను.
• సీబీఐని కూడా బెదిరించే స్థితికి వచ్చారు. రాంసింగ్ అనే అధికారిని బెదిరించి ఆయన పై తప్పుడుకేసులు పెట్టి, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఈ రోజువరకు జరిగిన సంఘటన లు అన్నీ చూస్తేనే అర్థమవుతోంది. ప్రపంచంలోని పోలీస్ అధికారులకు, న్యాయవాదు లకు, మర్డర్ చేసేవారికి వివేకాహత్యకేసు ఒకపెద్ద కేస్ స్టడీ. ముక్కలుముక్కలుగా నరికి, గుండెపోటుగా, రక్తపువాంతులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చివరకు సాక్షుల్ని కూడా బెదిరిస్తున్నారు.
• నన్ను కూడా అడ్డుకోవాలనిచూశారు. మీలాంటి రౌడీలతోకలు కత్తిరిస్తాం. దళితబిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీని పార్టీనుంచి సస్పెండ్ చేయకుండా ఊరేగింపుల తో ర్యాలీలు చేస్తారా? ఇక్కడేమో వివేకాహత్యకేసులో విచారణకుపిలిస్తే, వారికి మద్ధతుగా శాంతియుత ర్యాలీలు చేస్తారా? శవర్యాలీలు చేయండి. శవాన్ని తీసుకొచ్చి ప్రజల్ని బెదిరించండి. ఈరాష్ట్రంలో ధర్మం, న్యాయం లేవా? తనతండ్రిని చంపినవాడు ఎవడో దేశానికి తెలియచేయాలని ఒకఆడబిడ్డ పోరాడుతుంటే ఆమెకు సంఘీభావం తెలియచేయరా? ఆ అమ్మాయి పోరాడుతోంది తనతండ్రి ఆత్మశాంతికోసం. ఇంత చేసి కూడా ఈ కేసునుంచి దుర్మార్గులు తప్పించుకుంటే ఇంకేమైనా ఉందా?
• ఈ కేసు వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారంచేయాలి. ప్రజలు ఓట్లేసి ప్రజాపాలన చేయమంటే హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు చేస్తారా? రాష్ట్రంలో తీవ్రవాదాన్ని, ఫ్యా క్షనిజాన్ని కట్టడిచేసంది తెలుగుదేశంపార్టీనే. రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని తొక్కి పెట్టింది తెలుగుదేశంపార్టీనే. ఇదే పోలీసులు టీడీపీప్రభుత్వంలో ఖాకీచొక్కా గర్వపడే లా పనిచేశారు. ఇప్పుడేమో మాట్లాడేవారిపై తప్పుడుకేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వంపై, ప్రజాసమస్యలపై పోరాడుతున్న తెలుగుదేశానిదే తుదివిజయం.
• కేజీబియ్యం రూ.2లకే పేదలకు అందించి, ఆహారభద్రతకునాంది పలికిన వ్యక్తి స్వర్గీ య ఎన్టీఆర్ గారు. ఈ ప్రబుద్ధులు పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా దోచుకుం టున్నారు. నిరుద్యోగం పెంచారు. టీడీపీప్రభుత్వంలో నిరుద్యోగశాతం 3శాతమైతే, ఇప్పుడు 13.5శాతానికి పెరిగింది. విభజనతో రాష్ట్రం అనేకసమస్యలు ఎదుర్కొం టోందని, యువతకు ఉద్యోగాలు రావాలని ప్రపంచమంతా తిరిగి రాష్ట్రానికి రూ.16 లక్షలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈజ్ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని మూడేళ్లు నెంబర్ 1గా నిలిపాం. రూ.5.50లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
• అధికారంలోకి వచ్చి 5ఏళ్లు కావస్తోంది. మీరు ఏంచేశారో చెప్పగలరా? రాష్ట్రానికి కియా మోటార్స్ తీసుకొచ్చాం. రూ.20వేలకోట్ల ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడి తీసుకొచ్చాం . నీళ్లులేని ప్రాంతానికి నీళ్లుతీసుకొచ్చి, కియాను తీసుకొచ్చాం. టీడీపీఅధికారంలో ఉంటే కడప ఉక్కుఫ్యాక్టరీ పూర్తయ్యేది. ఈ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఫౌండేషన్ వేస్తా డు? కోడికత్తి డ్రామాలాగా ఎన్నిడ్రామాలు ఆడతారు?
• జాబు రావాలంటే బాబురావాలన్నదే ప్రతి ఒక్కరి నినాదంకావాలి. యువత భవిష్యత్ బాగుండాలంటే టీడీపీనే గెలవాలి. ఇప్పటికే గంజాయి యువతజీవితాల్ని నాశనం చే స్తోంది. జగనన్న స్టిక్కర్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి రంగులపిచ్చి, ప్రచారపిచ్చి. వైఎస్సార్ కాంగ్రెస్ దొంగలముఖాన స్టిక్కర్లు వేస్తే, వారుదొంగలని తెలుస్తుంది. భూమి ప్రజలది అయితే పట్టాదార్ పాస్ పుస్తకాలపై, సర్వేరాళ్లపై జగన్ బొమ్మలా? నువ్వే మా భవిష్యత్ .. నువ్వే మానమ్మకం అంటా! బాబాయ్ ని చంపేసినవారు భవిష్యత్ ఆశాజ్యోతులు అవుతారా?
• ఈ జగనే రాష్ట్రానికి దరిద్రం. ఒక సైతాన్. రాష్ట్రానికిపట్టిన శని. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తు న్న భూతం. 4ఏళ్లనుంచి ఎవరూ కంటినిండా నిద్రపోయింది లేదు. ప్రభుత్యఉద్యోగులు , పోలీసులు, ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నెలలో మొదటితారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడుజీతాలు వస్తాయోతెలియదు. ఒకప్పుడుజీతాలు పెంచ మని డిమాండ్ చేసినవారు.. ఇప్పుడు జీతాలువస్తే చాలంటున్నారు. భూమి మాది అంటే వారికి రాసిచ్చేయాలి. లేకపోతే ఆభూమిని 22జాబితాలోకి చేర్చి మాదిఅని కొట్టేస్తున్నారు.
• సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశంపాలన. అన్నాక్యాంటీన్, విదేశీవిద్య, చంద్రన్న బీమా ఏమయ్యాయి? రంజాన్ తోఫా ఉందా? ఎస్సీఎస్టీలు, బీసీలకు సబ్ ప్లాన్ ఉందా ? బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ఏమయ్యాయి. గర్భిణులకు ఇచ్చే పౌష్ఠికాహారం, ఉచిత వైద్యసేవలు ఇప్పుడున్నాయా? మహాప్రస్థానం సేవలు ఉన్నాయా? రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? రాయలసీమలో 90శాతం సబ్సిడీపై టీడీపీప్రభుత్వం మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించింది. విత్తనాలు, సూక్ష్మపోషకాలు, ఎరువులు అందించాము. ట్రాక్టర్లుఇచ్చాము. రాయలసీమను హర్టికల్చర్ హబ్ గా మార్చడానికి ఇరిగేషన్ కోసం టీడీపీపనిచేసింది. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి రూ.64వేల కోట్లు ఖర్చుపెడితే, రాయలసీమలో రూ.8,500కోట్లు ఖర్చుపెట్టి, అన్ని ప్రాజెక్ట్ ల పనుల్ని పరుగులుపెట్టించింది. ఈ ప్రభుత్వం నాలుగన్నరేళ్లలో ఒక్క ప్రాజె క్ట్ పూర్తిచేసిందిలేదు. రూ.2వేలకోట్లు కూడాఖర్చుపెట్టలేదు. గండికోట పూర్తిచేసి లిఫ్ట్ లతో పులివెందులకు నీళ్లిచ్చి, చీనిపంటల్ని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమే.
• పట్టిసీమను పూర్తిచేసి 120టీఎంసీలను కృష్ణాడెల్టా నుంచి శ్రీశైలానికి రప్పించి, రాయ లసీమకు నీళ్లిచ్చింది తెలుగుదేశంప్రభుత్వమే. మరలా అధికారంలోకి వచ్చిఉంటే, పోలవరం పూర్తి అయ్యేది. రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. రాయలసీమ రతనాల సీమ అయ్యేది. ఈ ప్రభుత్వంలోఇరిగేషన్ పూర్తిగా దెబ్బతిన్నది. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పూర్తైతే శ్రీశైలానికి నీళ్లురావు. ఈ ముఖ్యమంత్రి ఉంటే పోలవరం పూర్తికాదు. పోల వరం పూర్తికాక, శ్రీశైలానికి నీళ్లురాకపోతే రాయలసీమ ఎడారి అవుతుంది. రాయల సీమకు తీరని ద్రోహంచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అప్పర్ భద్రప్రాజెక్ట్ పై ముఖ్యమం త్రి ఒక్కమాటకూడా మాట్లాడటంలేదు.
• కర్నూలుజిల్లాలోని ఓర్వకల్లులో రూ.90కోట్లతో, 16నెలల్లో విమానాశ్రయాన్ని పూర్తిచేసింది తెలుగుదేశం పార్టీనే. ఓర్వకల్లులో సుమారు 10వేలఎకరాల్లో ఇండస్ట్రియ ల్ ఎస్టేట్ పూర్తిచేసింది తెలుగుదేశంప్రభుత్వమే. సోలార్ విద్యుత్ కోసం మెగాప్రాజెక్ట్ ను పూర్తిచేసి, 6వేలమందికి ఉపాధి కల్పించాము. జైన్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా ఫు డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను రూ.3,600కోట్లతో ప్రారంభించాము. ప్రపంచానికే మంచి సీడ్ అందించేలా మెగాసీడ్ పార్క్ కు శ్రీకారంచుట్టాము. రామ్ కో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్రాజెక్ట్ ను టీడీపీ తీసుకొస్తే, మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేశారు. టీడీపీ రాగానే మనవాళ్లకే ఉద్యోగాలుఇప్పిస్తాం.
• ముచ్చుమర్రి నిర్మాణానికి రూ.549కోట్లువెచ్చించి, 90వేలఎకరాలకు నీళ్లిచ్చాం. సిద్ధా పురం ఎత్తిపోతల పథకాన్ని రూ.120కోట్లతో పూర్తిచేశాం. పులకుర్తి ప్రాజెక్ట్ కు రూ.64 0 కోట్లు, గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిచేశాం. పులికనుమకు రూ.294 కోట్లు, అవుకు టన్నెల్ కు రూ.452కోట్లు ఖర్చుపెట్టాం. ఇన్నికార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వమే కర్నూలుజిల్లాలోచేసింది. ఈ ప్రభుత్వం ఏంచేసిందో, మనం ఏంచేశామో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి.
• వెలుగోడు రిజర్వాయర్ ద్వారా ఇప్పుడు ఒకపంటకే నీళ్లిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రెండు పంటలకు చివరిభూములకు కూడా నీళ్లిస్తుంది అని స్పష్టం చేస్తున్నాం. మిడ్తూరుమండలం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తాగు నీరుఇవ్వడానికి రూ.110కోట్లు కేటాయించిపనులు చేపడితే, అవికూడా నిలిపేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లువేసి, ఎల్.ఈ.డీ బల్బులువేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరుగుదొడ్లనిర్మాణంతో పాటు, అంగన్ వాడీ భవనాలు, సామాజిక భవనాలు నిర్మిం చింది మనప్రభుత్వమే. వీటన్నింటిపై సెల్ఫీ ఛాలెంజ్ లు విసరండి.
• అనంతపురంజిల్లాలో కియామోటార్స్ తీసుకొచ్చాం. సెంట్రల్ యూనివర్శిటీ పెట్టాం. హంద్రీనీవా పూర్తిచేశాం. తుంగభద్రప్రాజెక్ట్ హైలెవల్ కెనాల్ పనులు రూ.310కోట్లతో పూర్తిచేశాం. మిడ్ పెన్నాసౌత్ కెనాల్ ఆధునీకరణ కోసం రూ.124కోట్లు ఇచ్చాం. గుం తకల్లు బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కోసం రూ.111కోట్లు ఇచ్చాం. ఇవన్నీ ఏమయ్యా యి? ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. జాకీ కంపెనీని తీసుకొస్తే, దాన్ని కూడా తరిమేశారు. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో మంత్రి చెరువులు ఆక్ర మిస్తూ, అన్యాక్రాంతంగాభూములు కొంటున్నారు. ధర్మవరం ఎమ్మెల్యేభూబాగోతంపై యువగళం పాదయాత్రలో మాట్లాడితే, ఆయన ప్రజలపై పడ్డాడు. ఎగిరెగిరిపడ్డాడు.. కథ తేల్చడంతో నోరెత్తకుండా ఉండిపోయాడు.
•ఇక్కడున్న బుగ్గన పిట్టకథలకే పరిమితమయ్యాడు. అవినీతినిప్రశ్నించిన ధర్మవరం సుబ్బారెడ్డిపైచాలా కేసులుపెట్టారు. గ్రానైట్ వ్యాపారులపై విజిలెన్స్ దాడులు చేయిం చి, రూ.140కోట్ల జరిమానాలు వేయించారు. మురళీకృష్ణ గౌడ్ ఇంటి కాంపౌండ్ వాల్ ను కూలగొట్టారు. జగన్నాథగుట్టనుంచి ఎర్రమట్టిని తవ్వుతూ, అక్రమార్జన చేస్తున్నారు. విచ్చలవిడిగా ఎవరికివారు అవినీతిలో మునిగితేలుతున్నారు. వైసీపీఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టి, వారిన ఉతికిపారేయాల్సిన బాధ్యత తెలుగుతమ్ముళ్లదే. ఆదాయం పెరగలేదని, ఖర్చులుపెరిగాయని ప్రజలు ఆవేదనతో ఉన్నారు. నేరాలు, ఘోరాలపై కూడా తీవ్రంగా కలతచెందుతున్నారు. వివేకాహత్యే పెద్దఉదాహరణ. ఇవన్నీకూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఉద్యోగాలులేక యువత, వ్యవసాయం సరిగా లేక రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. అన్నివర్గాలకు ధైర్యంచెప్పి, తామున్నా మనే భరోసాకల్పించి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొనేలా వారిని చైతన్యవం తుల్నిచేయాల్సిన బాధత్య మీపైనే ఉంది.
• నేను మీకు దగ్గరకావాలనే చూస్తాను. పనిచేసేవారిని గుర్తించే బాధ్యతనాది. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యతమీది. మీకుఉన్న పట్టుదలపై నాకుఅనుమానంలేదు. మనం వచ్చేఎన్నికల్లో బ్రహ్మండమైన మెజారిటీతో గెలుస్తాం.
కడపలో జరిగిన టీడీపీ జోన్ 5 సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు , ఇతర ముఖ్యనేతలు, ఇంఛార్జి లు.
addComments
Post a Comment