జగనన్న వసతి దీవెనతో విద్యార్థుల
ఉన్నత చదువులకు సీఎం భరోసా
- విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
- జిల్లాలో 48282 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు సుమారు రూ. 46.98 కోట్లు జమ
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడి
నెల్లూరు, ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి) : జిల్లాలో జగనన్న వసతిదీవెన పథకం కింద ఉన్నత చదువులు చదువుతున్న 48282 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు సుమారు రూ. 46.98 కోట్లను ముఖ్యమంత్రి జమ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.
బుధవారం ఉదయం అనంతపురం జిల్లా నార్పల గ్రామం నుంచి జగనన్న వసతి దీవెన నిధులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయగా, నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి , జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ శ్రీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ శ్రీ హరినారాయణన్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారన్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు కూడా దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కార్పొరేట్ విద్యను ఉచితంగా అందజేశారని, ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రేఖలు సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి, అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక, విదేశీ విద్య వంటి అనేక పథకాలను అమలు చేస్తూ విద్యార్థుల పాలిట ఒక వరం లా మారారన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1778 కోట్ల రూపాయలతో పాటు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాల ద్వారా ఈ నాలుగేళ్లలో 14223 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని క్రమం తప్పకుండా అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థులందరూ ముఖ్యమంత్రి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తొలుత జగనన్న వసతి దీవెన నిధులకు సంబంధించి మెగా చెక్కును ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకటయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కనకదుర్గా భవాని, ఐటీడీఏ అధికారి పరిమళ, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు
..................................
1). కాలేజీ ఫీజులకు ఇబ్బందులు లేవు
- మోపూరు రేవతి, పడారుపల్లి
- నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త సాధారణ లారీ డ్రైవర్. మా పాప జ్ఞాన దీపిక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె హాస్టల్ ఫీజులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగనన్న వసతి దీవెన పథకం మాకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. మా బాబుకు అమ్మ ఒడి, నాకు ఆసరా పథకం కింద అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మాలాంటి పేదవారి పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా జగనన్న పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
......
2). గతంలో ఎప్పుడూ అకౌంట్లో డబ్బులు పడలేదు
- కొత్తపల్లి సుబ్బమ్మ, సంతపేట, నెల్లూరు
- అందరికీ మంచి చేస్తున్న జగన్ బాబు పది కాలాలపాటు చల్లంగా ఉండాలి. నేను ఈరోజు నా బిడ్డ మేఘనను డిగ్రీ చదివిస్తున్నానంటే.. జగన్ బాబు ఇచ్చే పథకాలే కారణం. నేను ఎవరి దగ్గరికి వెళ్లకుండానే నా అకౌంట్లో పాప చదువుకు డబ్బులు వేస్తున్నాడు. గతంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా డబ్బులు వెయ్యలేదు. పేదవారి గురించి ఆలోచన చేసి సాయం చేస్తున్న జగన్ బాబుకు నా ఆశీస్సులు.
addComments
Post a Comment