*- చంద్రన్న అడుగుజాడల్లో "వెనిగండ్ల రామన్న రంజాన్ తోఫా"*
*- గుడివాడ నియోజకవర్గంలో 6 వేల ముస్లిం కుటుంబాలకు పంపిణీ*
*- ముస్లిం మైనారిటీలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి*
*- క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్*
*- ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వెనిగండ్ల*
*- ముస్లిం మైనారిటీ పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు*
గుడివాడ, ఏప్రిల్ 22 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రన్న అడుగుజాడల్లో టిడిపి నేత వెనిగండ్ల రామన్న పయనిస్తున్నారు. దీనిలో భాగంగా ముస్లింల పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 6 వేల ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసారు. ముందుగా ముస్లిం మైనారిటీ పెద్దలు అబూ, షేక్ ఇబ్రహీం, నూర్ తదితరులతో కలిసి వెనిగండ్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులను పరస్పరం ఆలింగనం చేసుకొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెనిగండ్లను ముస్లిం మైనారిటీ నేతలు సాంప్రదాయపద్ధంగా ఘనంగా సత్కరించారు. అనంతరం వెనిగండ్ల మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ పెద్దలతో కలిసి రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేసారని కొనియాడారు. చంద్రబాబు హయాంలోనే ముస్లింల చేయూత కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలందరికీ రంజాన్ తోఫాను కూడా అందజేశారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని రీతిలో ముస్లింలకు టిడిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అందించిందన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. టిడిపి హయాంలోనే మతసామరస్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. అనేక ప్రభుత్వాలు ముస్లింలను ఓట్ బ్యాంకుగానే చూశాయని, ముస్లింల సంక్షేమమే పట్టలేదన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి ముస్లింలు నారా హమారా- టిడిపి హమారా అని మద్దతు పలుకుతున్నారన్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రంజాన్ తోఫాతో సహా అన్ని సంక్షేమ పథకాలను మళ్లీ తీసుకొస్తానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారని గుర్తు చేశారు. ముస్లిం యువతల వివాహాలకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన దుల్హన్ పథకానికి ఎస్.ఎస్.సీ నిబంధనను తొలగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబుకు ముస్లిం మైనారిటీలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. అల్లా అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కలకాలం అల్లా దీవెనలను అందించాలని వెనిగండ్ల ఆకాంక్షించారు.
addComments
Post a Comment