సదుం,ఏప్రిల్ 6 (ప్రజా అమరావతి):
*ప్రతి ఆడపడుచు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి
* :
*వై ఎస్ ఆర్ ఆసరాలబ్దిదారురాలు రమాదేవి*
సదుం లో జరిగిన బహిరంగ సభలో
వై ఎస్ ఆర్ ఆసరా
లబ్దిదారురాలు రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు కష్టం వస్తే మొదటగా తండ్రి తరువాత అన్న స్పందించి కష్టం తీర్చడంలో ముందుంటారని అలాగే అన్న స్థానంలో మన ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు, తండ్రి స్థానంలో మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు ఉంటూ ఆడపడుచుల కష్ట నష్టాలను గుర్తించి వాటిని దూరం చేయడానికి ఆలోచన చేస్తున్నారని, ఇందులో భాగంగా మహిళల అభ్యున్నతికి అవసరమైన వై.యస్.ఆర్ ఆసరా, జగనన్న తోడు, వై.యస్.ఆర్ చేయూత, పెన్షన్ లు వంటి పథకాలను అమలు చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జన్మజన్మలా రుణపడి ఉంటామని, ఈ పథకాల ద్వారా పొందే లబ్ధిని వినియోగించుకుని మహిళలు వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
addComments
Post a Comment