జిల్లాలో ఒక్క అనీమిక్ కేసు కూడా రాకూడదు.


మచిలీపట్నం, ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి);


*జిల్లాలో ఒక్క అనీమిక్ కేసు కూడా రాకూడదు


*


 *ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా-కలెక్టర్ రాజబాబు*


జిల్లాలో గర్భవతులు కిషోర్ బాలికలు పాఠశాల విద్యార్థులలో ఒక్కరు కూడా అనిమీయాతో బాధపడకూడదని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు.


జిల్లాలో గర్భవతులు, కిషోర్ బాలికలు, పాఠశాల విద్యార్థులలో అనీమియాతో ఎంతమంది ఉన్నారు? అనీమియా నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. అనీమియా డేటా పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో  ఒక్కరు కూడా అనీమీయాతో బాధపడకూడదు అన్నారు.


పాఠశాలల్లో విద్యార్థులందరూ జగనన్న గోరుముద్ద కింద రాగి జావ వంటి పోషక ఆహారం, మధ్యాహ్నం భోజనం తీసుకునే విధంగా చూడాలని, భోజన అనంతరం వారికి ఐరన్, జింక్ మాత్రలు అందించాలని, వాటిని వారు వినియోగించేలా చూడాలని, ఈ కార్యక్రమంపై పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.


అనీమియా నివారణకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా  వైద్య ఆరోగ్య, విద్య, డిఆర్డిఏ, డి ఎల్ డి వో అధికారులు సంయుక్తంగా చర్చించి అనీమియా కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) రూపొందించి సమర్పించాలన్నారు.


జిల్లాలో ఫీవర్ సర్వే రెగ్యులర్గా జరగాలన్నారు. ఒకే చోట ఎక్కువ కేసులు నమోదైతే ఎపిడమిక్ చర్యలు తీసుకోవాలని అన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు.


ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కు తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ ఆరా తీశారు 104- వాహనాలు జిల్లాలో 31 ఉన్నాయని, వాటి ద్వారా ప్రతి గ్రామం నెలకు రెండుసార్లు వైద్య బృందం సందర్శించేలా, షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో రాండంగా పరిశీలిస్తామన్నారు.


జిల్లాలో డయేరియా కేసులు ఒకే చోట నమోదైతే వెంటనే ఆ ప్రాంతంలో తాగునీరు పరీక్షలు నిర్వహించాలని వాటర్ లీకేజీలు గుర్తించాలని నీటి కాలుష్యానికి కారణాలు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.


ఈ సమావేశంలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ విజయభారతి డీఈవో తహెరా సుల్తానా పాల్గొన్నారు.

Comments