భీమవరం. ఏప్రిల్ 06 (ప్రజా అమరావతి);
*నిరు పేదలందరికీ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేయడానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింద
ని జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు*...
గురువారం భీమవరం మండలం తాడేరు గ్రామ సచివాలయంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ను, శాసనసభ్యులు గ్రంధి. శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ప్రారంభించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పేద ప్రజలు అందర్నీ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేయడానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో వ్యాధిని గుర్తించడం దానిని తగ్గించేందుకు వివిధ రకాల వైద్య సేవలు అందించి మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. పీహెచ్సీ లో ఉన్న ఇద్దరు డాక్టర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి ముందుగా వారికి ఏ విధమైన జబ్బులు ఉన్నాయో గుర్తించి వారికి అవసరమైన మందులు ఇవ్వడం, వైద్యం అందించడంతో పాటు వారం వారం వారి యొక్క ఆరోగ్య అని పరీక్షించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. డాక్టర్ల బృందం మీ గ్రామాలకు వచ్చే ఒకరోజు ముందు ఏఎన్ఎం , ఆశా సిబ్బంది మీ గ్రామాలకు వచ్చి రేపు డాక్టర్ల బృందం వస్తుందని వారిని అలర్ట్ చేసి అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆమె అన్నారు. మీరు బాధపడే వ్యాధులతో మీ కుటుంబ సభ్యులు ఏవ్వరికీ వ్యాధి సోకకుండా వైద్య పరీక్షలు చేసి తగు ముందస్తు జాగ్రత్తలు తీసు కుంటారని కలెక్టరు అన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యా , ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి గ్రామాలలో డాక్టరు వైయస్సార్ ఆరోగ్య హెల్త్ క్లినిక్ లు నిర్మించడం జరిగిందన్నారు. పీహెచ్సీలు అన్ని వాడుకలోకి తీసుకురావడం 108 , 104 వాహనాలను బలోపేతం చేయడం ఆరోగ్యశ్రీ అమలు చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కూడా అందించడం జరుగుతుందని కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు.
శాసనసభ్యులు గ్రంధి. శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయాలు గ్రామస్థాయిలో సిబ్బంది వాలంటీర్లను నియమించి ప్రజలకు చేరువుగా ఉండి సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు మహిళలు పేరును ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడమే కాకుండా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగు తుందని ఆయన తెలిపారు. పిల్లలందరికీ పాఠశాలల్లోకి తీసుకుని వచ్చి వారిని చదివించేందుకు అమ్మఓడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ 104 , 108 వాహనాలను బలోపేతం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ లో లేని రోగాలకు ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇచ్చి రోగాలను నయం చేయించడం జరుగుతుందని శాసనసభ్యులు గ్రంధి. శ్రీనివాస్ అన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇంటింటికీ వైద్యం" అనే కార్యక్రమంలో భాగంగా104 వాహన్నాని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి, శాసనసభ్యులు గ్రంధి. శ్రీనివాస్ కలసి ప్రారంభించారు. ఇద్దరు కలసి వాహనంలో కూర్చుని వైద్యాధి కారులతో మాట్లాడారు.గ్రామంలో ఎంత మంది ఏ యన్ యం లు , ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు.ఏన్ని ఇండ్లకు వైద్య సేవలు అందించారు.ఏన్ని రకాలు జబ్బులు గుర్తించారు. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు , ఈ నెలలో ఎన్ని డెలివరీలు చేశారని వైద్యాధికారిని జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి డా.భాను నాయక్, గృహ నిర్మాణ శాఖ ఇ ఇ బి. వెంకట రమణ, తహశీల్దారు వై. రవి కుమార్, పురపాలక సంఘం కమీషనరు యస్. శివ రామ కృష్ణ,యం పి డి వో శ్రీ రామచంద్ర ప్రభు,యం పి పి పేరిచర్ల.విజయ నరసింహా రావు, జెడ్ పి టి సి సభ్యులు కాండ్రేగుల. నరసింహా రావు,మాజీ ఏ యం సి చైర్మన్ తిరుమాని.ఏడుకొండలు, మాజీ యం పి పి బండి. శక్తిశ్వర సాంబమూర్తి, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment