రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
.. ఫేజ్ ఒన్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని ఈ నెల ఆఖరి లోపు పూర్తి చేయాలి..
..గృహ నిర్మాణంలో రోజు వారీగా స్టేజి పురోగతి ఉండాలి.
..కలెక్టర్ డా. కే. మాధవీలత
స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో పరిష్కరించాలని, రీసర్వే, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, పర్యాటక శాఖకు చెందిన భూమి అలియనేషన్ త్వరితగతిన చేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు, పంచాయతీ రాజ్ శాఖలు మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి న్యూ ఢిల్లీ ఏపి భవన్ నుంచి రీ సర్వే పనులు, జాతీయ రహదారులు, హౌసింగ్ లక్ష్యాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇండ్ల నిర్మాణాలు , పంచాయతీ రాజ్ ఉపాధి హామీ, స్వమిత్వ, అమృత్ సరోవర్, క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్ప, ఎస్డబ్ల్యుపిసి షేడ్స్, కమ్యూనిటీ టాయ్లేట్స్ తదితర అంశాలపై పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్, కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
వీసీ అనంతరం కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ అధికారులతో సమీక్షిస్తూ జగనన్న భూ హక్కు పత్రాలలో 32225 కు గానూ ఇప్పటి వరకు 30,616 (95%) లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో వెబ్ ల్యాండ్ 2.0 వెర్షన్ కి చెంది 45 గ్రామాల్లో సర్వే కి చెంది 42 గ్రామాల్లో పూర్తి చేసి, 3 గ్రామాల్లో ప్రగతి లో ఉన్నట్లు తెలిపారు. రీ సర్వే స్టోన్ ప్లాంటేషన్ కి చెంది జిల్లాకు 54,245 సరఫరా చెయ్యగా ఇప్పటి వరకు 48719 (90%,) ప్లాంటేషన్ పూర్తి చేశామన్నారు. గ్రౌండ్ ట్రుధింగ్ 18 గ్రామాలకు గానీ 17 గ్రామాల్లో పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారులు కోసం రెండు ప్రాజెక్ట్స్ కోసం 126 హెక్టర్ల ప్రవేటు భూమి, 4 హెక్టార్ల ప్రభుత్వ భూమి సేకరణ పురోగతి ఉన్నట్లు తెలియచేశారు. పర్యాటక రంగం కోసం 20 ఎకరాల భూమిని కేటాయింపులు జరుపుతున్నట్లు కడియం లో 2.60 ఎకరాలు, కొవ్వూరులో 9.9 ఎకరాలు, పురుషోత్తమా పట్నం లో 7.5 ఎకరాలు మేర ఉన్నట్లు తెలిపారు. హౌసింగ్ కి సంబంధించి గత విసి నుంచి ఇప్పటివరకు 4897 ఇళ్ళ నిర్మాణాలలో స్టేజి కన్వర్షన్ ప్రగతి సాధించడం జరిగిందన్నారు. జిల్లాకు కేటాయించిన 16173 ఇంటి నిర్మాణ లక్ష్యం 15675 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక నిర్మాణాలు పూర్తి చేసి ప్రథమ స్థానంలో, పి ఎం ఎ వై కింద 6352 కు గానూ 6349 ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 13337 (85%) ఇళ్లకు విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 29,006 ఎస్ హెచ్ జి మహిళలకు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం చిరుధాన్యాలు సాగుపై దృష్టి సారించాలన్నారు. సి హెచ్ సి గ్రూపులకు మెషినరీ సబ్సిడీపై అందించి ఆర్బికే స్థాయిలో అందుబాటులో ఉంచి తక్కువ అద్దెతో వినియోగించడం కొరకు జిల్లాలో మంచిగా జరుగుతోందని ఇంకనూ అవసరమైన మెషినరీ ఈ నెల 28 లోపు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న పాల వెల్లువ కింద రిజిస్టర్ అయిన రైతులకు ప్రాధాన్యతతో చేయూత పథకం కింద పాడి పశువులు మంజూరు కొరకు చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలన్నారు. వివిధ స్టేజిలో ఉన్నవాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, స్టేజి వారీగా పురోగతి ఉండాలని ఆదేశించారు. సామూహిక గృహ ప్రవేశాలు మే లో ఉండే నేపథ్యంలో పురోగతి ఉండాలని సూచించారు. స్వామిత్వా పై దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని అన్నారు.
జిల్లాలో 184565 ఎకరాల ఈ క్రాప్ నమోదు చేయడం జరిగిందని, ఇందులో 98 శాతం మంది రైతుల వివరాలు ఈ కేవైసి పూర్తి చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కోసం 162 దరఖాస్తులు రాగా 121 సి హెచ్ సి లు 50 శాతం వాటా ధనం చెల్లించడం జరిగిందని, 99 యూనిట్స్ ఏర్పాటు చేసినట్లు తెలియచేశారు. వైయస్ఆర్ చేయూత కింద 8346 లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వారిలో 6255 కి మంజూరు ఉత్తర్వులు జారీ చేసి 74.95 శాతం మేర యూనిట్స్ గ్రౌండ్ చెయ్యడం జరిగిందన్నారు. ప్రాధాన్యత భవనాలు, గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిపై సమీక్ష చేసి, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చెయ్యడం జరుగుతుందని వివరించారు.
addComments
Post a Comment