వరంగల్ (ప్రజా అమరావతి);
వరంగల్ లోని రంగలీలా మైదానంలో జరిగిన ఏజెంట్ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, సినీ హీరో అక్కినేని నాగార్జున, అక్కినేని అనిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరోయిన్ సాక్షి వైద్యా, సినిమా యూనిట్ సభ్యులు.
*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ః*
ఏజెంట్ సినిమా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు!
మనం, అఖిల్, ఆటాడుకుందాం రా... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్... ఇవ్వాళ ఏజెంట్ గా మనమందుకు వస్తున్న అఖిల్ కు అభినందనలు!
ఇక సురేందర్ రెడ్డి... మన తెలంగాణ, అందునా వరంగల్ ముద్దు బిడ్డ
అతనొక్కడే తో మొదలై... అశోక్, ఊసరవెల్లి, రేసు గుర్రం, కిక్, చిరంజీవితో సైరా నర్సింహారెడ్డి వరకు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశాడు. ఇప్పుడు మన సిసింద్రీని పెద్ద హీరోని చేయడానికి ఏజెంట్ తో ముందుకు వచ్చాడు.
మమ్ముట్టి ఎన్ని గొప్ప సినిమాలు చేశాడు? దేశం, ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులు
పోసాని కృష్ణమురళి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు!
వరంగల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకున్న ప్రతి సినిమా సక్సెస్ సాధించింది.
ఈ సస్పెన్స్ యాక్షన్ త్రిల్లర్ ఏజెంట్ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది
సినిమా ఇండస్ట్రీ వరంగల్ కు రావాలి
ఇందుకు మంత్రి గా నా ప్రయత్నం నేను చేస్తాను.
వరంగల్ లో నిర్వహించిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది
శ్యామ్ సింగరాయ్, రొమాంటిక్, జాతి రత్నాలు, విరాట పర్వం, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు ఈ మధ్య వరంగల్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు సక్సెస్ ఫుల్ గా నడిచాయి.
ఆ సినిమాలు కూడా బాగా అడి ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాయి.
మంచి హీరో, డైరెక్టర్, హీరోయిన్, ఇతర నటీనటులు ఉన్నారు
ఇక సినిమా దుమ్ము రేపుతుంది. అనుమానమే లేదు
సినిమా బృందానికి నా తరఫున శుభాకాంక్షలు!
వరంగల్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్ పెట్టినందుకు కృతజ్ఞతలు!
మన వరంగల్ జిల్లా మంచి షూటింగ్ స్పాట్
సీఎం కెసిఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారు వరంగల్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు.
హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ చుట్టుముట్టూ మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి.
రామప్ప, లక్నవరం, బొగత వంటి జలపాతాలు, ఏటూరునాగారం అడవులు, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారు వంటి చారిత్రక ప్రదేశాలెన్నో ఉన్నాయి.
రామప్పకి ఈ మధ్యే అంతర్జాతీయ హెరిటేజ్ టూరిజం కేంద్రంగా యునెస్కో గుర్తింపు వచ్చింది.
ఆయా చోట్ల కూడా షూటింగులు చేయాలని దర్శకులు, నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
వరంగల్ లో షూటింగ్ చేస్తే చాలు 100 శాతం సక్సెస్ అని గతంలో సినిమాలు నిరూపించాయి
వరంగల్ లో తీసిన సినిమాలు ఎంత సక్సెస్ అయితున్నాయో మీకు తెలుసు.
కాళోజీ కళాక్షేత్రం కూడా ఏర్పాటు చేసినం.
సినిమాలను కూడా వరంగల్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.
చిత్ర యూనిట్ కి మరోసారి శుభాకాంక్షలు! అభినందనలు!! ఆల్ ది బెస్ట్!!!!
అనంతరం నాగార్జున, అఖిల్ సహా, సినిమా యూనిట్ సభ్యులందరికీ మంత్రి ఎర్రబెల్లి తన నివాసంలో విందు ఇచ్చారు.
addComments
Post a Comment