ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు  పింఛన్లు, నిత్యావసర సరుకులు ఇంటివద్దకే అందిస్తూ  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు  మండలం, నేలటూరు గ్రామంలో రూ.7 లక్షల రూపాయలతో నిర్మించిన  త్రాగునీటి శుద్ది కేంద్రాన్ని  మంత్రి శ్రీ  కాకాణి గోవర్ధన్  రెడ్డి ప్రారంభించారు. అనంతరం  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,   వివిధ పధకాల కింద వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.


ఈ సంధర్బంగా  మంత్రి  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు  ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవడంలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రజలకు వద్దకు వెళ్ళడం, వారి సమస్యలను తెలుసుకోవడం,  సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు  పింఛన్లు, నిత్యావసర సరుకులు ఇంటివద్దకే అందిస్తూ  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి తెలిపారు.  శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ప్రాంతానికి సంబంధించి  జెన్ కో 3వ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.  ఈ ప్రాంత ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని,  ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన  200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని,  మిగిలిన నిరుద్యోగ యువతకు కూడా  ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  ఈ రోజు జెన్ కో లో జరిగిన చిన్న ప్రమాద సంఘటనలో ఇద్దరు గాయపడటం జరిగిందని,  వారికి అన్నీ విధాలా మెరుగైన వైద్య చికిత్స అందించేలా  అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి వివరించారు.   ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు  ఈ ప్రాంత మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని  ఫిషింగ్ హార్బర్  నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని,  ఈ సంవత్సరం డిసెంబర్ నాటిని  పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

మంత్రి వెంట   ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments