నెల్లూరు, ఏప్రిల్ 15 (ప్రజా అమరావతి) : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వేగంగా పనులు చేపట్టాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ వారి ఛాంబర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన అభివృద్ధి పనులపై పర్యవేక్షక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల వారీగా మంజూరైన పనులను క్షేత్రస్థాయిలో ఆయా పర్యవేక్షక శాఖల అధికారులు పరిశీలించి, పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మంజూరైన పనులకు సంబంధించి బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలని సూచించారు. మంజూరైన పనులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలు అన్నీ కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులను త్వరితగతిన మొదలుపెట్టి పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈలు అశోక్ కుమార్, రంగవర ప్రసాద్, సంపత్ కుమార్, సిపిఓ సాలెం రాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment