నెల్లూరు, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి): జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన 118 గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వారి చాంబర్లో రీ సర్వే పురోగతిపై జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాధ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు డివిజన్ లలో మొదటి విడత రీ సర్వే చేపట్టిన గ్రామాల్లో పనుల పురోగతిని డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనుల పురోగతిని పరిశీలించి పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామ, భూమి సరిహద్దులను నిర్ధారించడం, భూమికి సంబంధించిన వివరాలు సేకరించడం, భూ హక్కు పత్రాలు, హద్దురాళ్ళు నాటడం మొదలైన రీ సర్వేకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో ఈ సర్వే పనులను పరిశీలించి, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వే పూర్తి చేసిన భూములకు భూ హక్కు పత్రాలను సకాలంలో అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్, ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్, ఆర్డీవోలు మలోల, కరుణ కుమారి, శీనా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment