ఎత్తులు, జిత్తులు తెలియకపోతే జగన్ బాబాయ్ హత్యను టీడీపీపైకి నెట్టి ఎలా అధికారం దక్కించుకున్నాడు?

 గుంటూరు తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మాజీమంత్రి శ్రీ  ఆలపాటి రాజేంద్రప్రసాద్ :

గుంటూరు (ప్రజా అమరావతి);

ఎత్తులు, జిత్తులు తెలియకపోతే జగన్ బాబాయ్ హత్యను టీడీపీపైకి నెట్టి ఎలా అధికారం దక్కించుకున్నాడు?


కుయుక్తులు తెలియకపోతే తన తండ్రిని రిలయన్స్ వారే చంపించారని ప్రజల్ని నమ్మించి, ఆ సంస్థకు చెందిన ఆస్తుల్ని ధ్వంసంచేయించి, చివరకు సదరు సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ చెప్పినవారికే రాజ్యసభ ఎలా ఇచ్చాడు?

 

ఏంచేశాడని ప్రజలు జగన్ ను నమ్మాలి? రాష్ట్రాన్ని అప్పులపాలుచేసినందుకా? నకిలీమద్యం అమ్మకాలతో  ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతున్నందుకా? ఉద్యోగాలు, ఉపాధి లేకుండాచేసి, యువతను మాదకద్రవ్యాలు, గంజాయికి బానిసల్నిచేసినందుకా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా? బీసీలు, దళితులు, మైనారిటీల్ని హింసిస్తూ, న్యాయంగా వారికి దక్కాల్సిన వాటిని లేకుండా చేసినందుకా?*

 

 తనకు ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు తెలియవంటున్న జగన్, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని, ఆత్మహత్యచేసుకున్నాడని, తరువాత టీడీపీ హత్యచేసిందని ఎలా చెప్పాడు? 

 ఏ ఎత్తూ లేకపోతే తనతండ్రి చనిపోవడానికి కారణం రిలయన్స్ సంస్థ అని చెప్పి, తనపార్టీవారితో రిలయన్స్ స్టోర్లపై దాడులుచేయించి, మరలా ఆసంస్థ అధినేత ముఖేశ్ అంబానీ చెప్పినవారికే జగన్ ఎలా రాజ్యసభ పదవి ఇచ్చాడు? 

 ఏపీలో ఎవరులేనట్టు ఎక్కడో ఉత్తరాదికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చాడు. 

 సొంతతల్లిని, చెల్లిని అధికారంలోకి వచ్చేందుకు వాడుకొని వారిని ఇప్పుడు రోడ్డునపడేయడమేనా జగన్ సాధించిన మంచితనం?

 జగన్ పోకడ, వైఖరి, అతని అహంకారపూరిత ప్రవర్తన నచ్చనందునే సొంతపార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కచూపులు చూశారు. 

 ప్రజలకు ఇచ్చినహామీల్లో ఏం నిలబెట్టుకున్నాడని జగన్ ను మరలా నమ్మాలి? కేజీ నుంచి పీజీ వరకకు అందరికీ ఉచిత విద్య అందిస్తానన్న హామీని నెరవేర్చినందుకు జగన్ ను నమ్మాలా? ఏటా ప్రతిరైతుకి రూ.12,500లు చొప్పున రూ.50వేలు ఇస్తాననిచెప్పి, ఇప్పటికీ రూ.30వేలు మాత్రమే ఇచ్చినందుకు రైతుల జగన్ ని నమ్మాలా? పంటలబీమా కింద రూపాయి కూడా రైతులు కట్టాల్సినపనిలేదని చెప్పి, చివరకు ప్రభుత్వవాటాగా కట్టాల్సిన సొమ్ముకూడా కట్టకుండా రైతులకు పంటలబీమా  సొమ్ము దక్కకుండా చేసినందుకు జగన్ ని అన్నదాతలు నమ్మాలా?

 అసెంబ్లీలో  ప్రతిపక్షనేత చంద్రబాబు పంటలబీమా సొమ్ముపై జగన్ ని నిలదీస్తే, ఆఘమేఘాలమీద అప్పటికప్పుడు బీమాసొమ్ముతాలూకా బకాయిలు విడుదలచేస్తూ జగన్ జీవో ఇచ్చింది నిజంకాదా? 

 రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీరుణాలు, గిట్టుబాటుధర ఏవీ అందించలేని రైతుభరోసా కేంద్రాలుపెట్టి, వాటిముసుగులో కర్షకుల్ని దోచుకుంటున్నందుకు వారు జగన్ ని నమ్మాలా?    

 డ్వాక్రారుణాలు ఒకేసారి మాఫీచేస్తానని చెప్పి లబ్ధిదారులసంఖ్యలో కోతపెట్టి, విడతలవారీగా ఇస్తున్నందుకు అక్కచెల్లెమ్మలు జగన్ ను నమ్మాలా?

 దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తాననిచెప్పి, పుస్తెలు తెంపుతూ, వేలకోట్లు దండుకోవడానికి అక్రమమద్యం వ్యాపారం సాగిస్తున్నందుకు జగన్ ని ఆడబిడ్డలు నమ్మాలా?

 అధికారంలోకి వచ్చినవెంటనే చంద్రబాబు పెట్టిన 47వేల బెల్టుషాపుల్ని తొలగిస్తాననిచెప్పి,  అదనంగా మద్యందుకాణాలుతెరిచి, కల్తీమద్యం అమ్ముతూ, ప్రజల జీవితాలతో వ్యాపారంచేస్తున్నందుకు జగన్ ని నమ్మాలా?

 జగన్ నిన్న తీసుకొచ్చిన కామెడీ ప్రోగ్రామ్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం. రాష్ట్రంలోని ప్రబుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు సరిపడినంత మంది వైద్యసిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, మందులు, పరికరాలు అందించకుండా ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాడో జగన్ చెప్పాలి. 

 బీసీలను టీడీపీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతంచేస్తే, వారికి దక్కాల్సిన రిజర్వేషన్లలో కోతపెట్టి, వారికి దక్కాల్సిన 16,800 రాజకీయపదవుల్ని దూరంచేయడమేనా జగన్ బీసీలకు చేసిన మంచి? 

 బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి, ఆదరణ పథకం రద్దుచేయడమేనా జగన్ ఈ నాలుగేళ్లలో బీసీలకు చేసిన మేలు? 

 ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కడమేనా జగన్ దళితులు, గిరిజనులకు చేస్తున్న మేలు?

 చంద్రబాబు దళితులకోసం తీసుకొచ్చిన విదేశీవిద్యను రద్దుచేయడం, అంబేద్కర్ పేరు మార్చి తనతండ్రి పేరుపెట్టుకోవడమేనా జగన్ దళితుల్ని ఉద్ధరించిన తీరు? 

 చంద్రన్నకానుక సహా 33 పథకాల్ని రద్దుచేసి, దళితులనోట్లో మట్టికొట్టిన జగన్, దళితుల్ని ఉద్ధరించాననిచెప్పడం సిగ్గుచేటు.

 దళితుల్ని హింసిస్తూ, వారిమానప్రాణాలు హరిస్తూ, వారిపైనే ఎస్సీఎస్టీ కేసులు పెట్టడమేనా జగన్ 4ఏళ్లల్లో వారికి చేసిన మేలు?  

 ప్రతి సభలో దేవుడిదయతో అంటూ అబద్ధాలు, అసత్యాలు చెప్పడం జగన్ కే చెల్లింది. 

 రెండునెలల క్రితం వైనాట్ 175 అని ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల్ని బతిమాలుకునే దుస్థితికి వచ్చాడు.

 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పుయాత్ర చేసిన జగన్,  అధికారంలోకి వచ్చిన 4ఏళ్లలో ఎందరినో బలితీసుకొని ఏనాడూ ఎందుకు చనిపోయినవారి కుటుంబాల్ని పరామర్శించలేదు? 

 డాక్టర్ సుధాకర్ సహా, వరప్రసాద్, విక్రమ్, ఓంప్రతాప్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి దళితయువకుల్ని బలితీసుకున్న జగన్ ఏనాడూ ఎందుకని వారి కుటుంబాల ముఖం కూడా చూడలేదు? 

 4 ఏళ్లలో ప్రజలకు జగన్ కట్టించిన ఇళ్లు ఎన్ని. 5ఏళ్లలో నిర్మిస్తానన్న 25లక్షల ఇళ్లు ఎప్పుడుపూర్తిచేసి జగన్ ప్రజలకు ఇస్తాడు? 

 గంజాయి, మాదకద్రవ్యాలు, నకిలీమద్యం అమ్మకాలతో పాటు జూదక్రీడలు, గుండాట,  కేసినోలు, కోడిపందాలు నిర్వహించడమేనా జగన్ ప్రజలకు అందిస్తున్న పాలన?

   నాలుగేళ్లపాటు ప్రజల్ని వంచించి, వారి జీవితాలు సర్వనాశనంచేసిన జగన్, ఇప్పుడు మరలా ప్రజల్ని నమ్మించడానికి జగనన్నే మా నమ్మకం, జగనే మా భవిష్యత్ అంటూ బూటకపు మాటలు చెబుతున్నాడు.

 విశ్వాసం, నమ్మకం అనే పదాలకు అర్థాన్నే మార్చేసిన ఘనుడిగా జగన్ నిలిచిపోతాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడుపట్టభద్ర స్థానాలు, ఎమ్మెల్యేకోటాలో  ఒకఎమ్మెల్సీ గెలిచాక జగన్ జనంలో నటించడం ఎక్కువైంది. 

 ఎన్నిరకాలుగా రాష్ట్రాన్ని నాశనంచేయాలో చేసేసిన జగన్, ఇప్పుడు యువశక్తిని నిర్వీర్యం చేయడానికి గంజాయి, మాదకద్రవ్యాలను యువతపై  ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాడు. 

 ఈనాడుసంస్థపై, దాని అధినేత రామోజీరావుపై దాడిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్న జగన్ , ఒకసారి రామోజీరావు రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మంచిని గుర్తించాలి. 

 తెలుగుభాషను గౌరవించి, మాతృభాష కోసం పాటుపడిన గొప్పవ్యక్తి రామోజీరావు, సమాచారహక్కు చట్టానికి కొత్తఅర్థంచెప్పి, సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రభుత్వాలను ప్రశ్నించేలాచేసిన ఘనాపాటి రామోజీరావు.  ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి వంటి ఇతర సంస్థల్నినిర్వహిస్తూ వేలమందికి ఉపాధికల్పిస్తూ, ఎక్కడా ఏనాడు చిన్న ఆరోపణలేకుండా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి సంస్థపై చిన్నఫిర్యాదు కూడా లేకపోయినా, జగన్ పనిగట్టుకొని దానిపై దాడిచేయడం.. అక్రమ అరెస్ట్ లు చేయడం కక్షసాధించడం కాదా? 60ఏళ్ల నుంచి నడుస్తున్న మార్గదర్శి చిట్స్ పై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంగానీ, ఐటీ విభాగం గానీ ఎన్నడూ ఎలాంటి తప్పులు కనిపెట్టలేని మార్గదర్శిపై తప్పుడకేసులు పెట్టడానికా జగన్ కు ప్రజలు అధికారమిచ్చింది? 

 మార్గదర్శి చిట్ వ్యాపారం ఆర్బీఐ కిందకు రాకపోయినా, జగన్ కొండను తవ్వి చీమను కూడా పట్టలేని విధంగా, చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయికదా అని పనికిమాలిన విచారణ జరుపుతున్నాడు.

 జగన్ రాష్ట్రం నుంచి తరమికొట్టిన పరిశ్రమలు ఎన్ని. కియా అనుబంధపరిశ్రమలు ఎందుకు పొరుగురాష్ట్రానికి వెళ్లాయి. అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకు తెలంగాణకు వెళ్లింది? చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న లులూగ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ గ్రూప్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, ఏషియన్ పేపర్ మిల్స్ సంస్థలు ఎందుకు రాష్ట్రంలో పెట్టబడులు పెట్టలేదో జగన్ చెప్పాలి. 

 తనకు పత్రికే లేదని చెబుతూ, వేలకోట్లు దోచిపెడుతున్న సాక్షిపత్రిక ఎవరిదో జగన్ చెప్పాలి. సాక్షి టీవీ తనకు బాకా ఊదుతున్న బ్లూమీడియా ఎవరివో జగన్ చెప్పాలి. 

 తనకు డబ్బేలేదు పేదవాడిని అంటున్న జగన్ ఎన్నకల్లో పోటిచేసిన ప్రతిసారి ఎన్నికల అఫిడవిట్లో తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయని ప్రకటించాడో ఒక్కసారి ప్రజల ముందు ఉంచాలి. 

 32 ఈడీకేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్, అక్రమార్జనలో 16నెలలు జైలుకు వెళ్లివచ్చిన జగన్ తాను అవినీతికి పాల్పడలేదని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 

 ఏం చేశాడని జగన్ ని ప్రజలు నమ్మాలి. 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకా? చెత్తపన్ను వేసినందుకా? పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా పెంచినందుకా? నిత్యావసరాల ధరలు పెంచినందుకా? ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా? 

 రాజధాని నిర్మాణానికి రైతులు భూములిస్తే, వారి భూముల్ని అమ్ముకుంటాను, వారికివీరికి ధారాధత్తంచేస్తాను అనడానికి జగన్ ఎవరు? ఏం అధికారం ఉందని జగన్ రైతులభూములతో ఆటలాడుతున్నాడు? 

 ప్రత్యేకహోదా తెస్తాననిచెప్పి ప్రజల్ని, ముఖ్యంగా యువతను వంచించినందుకు జగన్ ని నమ్మాలా? రైల్వేజోన్ అటకెక్కించినందుకా? పోలవరాన్ని నాశనంచేసినందుకా? చంద్రన్న బీమాను ఆపేసినందుకా.. అన్నక్యాంటీన్లు మూసేసినందుకా? విశాఖ గ్లోబల్ సమ్మిట్ పేరుతో దొంగ ఎంవోయూలు చేసుకొని యువతను వంచించినందుకా?            

 జగన్ చేసిన తప్పుల లెక్క శిశుపాలుడి జాబితానే మించిపోయింది. ఇల్లే లేదంటున్న జగన్ కు తాడేపల్లి, హైదరాబాద్, ఇడుపులపాయలో, బెంగుళూరులో ప్యాలెస్ లు ఎక్కడినుంచి వచ్చాయి. 

వాస్తవాలు కప్పిపుచ్చుతూ, నిజాల్ని సమాధిచేస్తూ జగన్ సాగిస్తున్న ప్రజాకంటక పాలనకు ఎప్పుడు చరమగీతం పాడుదామా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రాన్ని అవినీతికి ఆలవాలంగా మార్చిన జగన్ పాలనకు సస్తిచెప్పేందుకు ఆడబిడ్డలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Comments