నాణ్యతగా భోజనం అందించాలి.

 *నాణ్యతగా భోజనం అందించాలి


*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


*: ధర్మవరం పట్టణంలోని ఎల్సికేపురం అంగన్వాడి కేంద్రం- 1,2 లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 18 (ప్రజా అమరావతి):


అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యతగా భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎల్సికేపురం అంగన్వాడి కేంద్రం - 1,2 లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మంచి ఆహారం అందిస్తున్నారని, మధ్యాహ్న భోజనం నాణ్యతలో మరింత పురోగతి చూపించాలన్నారు. చిన్నారులకు నాణ్యత కలిగిన ఆహారం అందించడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎన్ని కోడిగుడ్లు వచ్చాయి, స్టాక్ బ్యాలెన్స్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారి విద్యా ప్రమాణాలను పరిశీలించి విద్యార్థులకు మంచి విద్య బోధించాలన్నారు. చిన్నారులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యోగేశ్వరిదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments