శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.06-04-2023 న బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాలు నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ చే రేపు అనగా ది.07-04-2023 న పవిత్ర కృష్ణా నది యందు నిర్వహించు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల "కృష్ణ వేణి నదీ విహారం" కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కేసరి నాగమణి, చింతా సింహాచలం గార్లు స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ , కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి. ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి , సహాయ కార్యనిర్వాహనాధికారి ఎన్. రమేష్ పాల్గొన్నారు.
ఈ సమావేశం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ దేవస్థానం నందు అత్యంత వైభవముగా నిర్వహించిన శ్రీ అమ్మవారి చైత్రమాస బ్రహ్మోత్సవములు, బ్రహ్మోత్సవముల సందర్బంగా ప్రతి రోజు సాయంత్రం నగర వీధుల యందు జరిగిన అమ్మవారు, స్వామివార్ల వివిధ వాహన సేవల గురించి తెలిపి, బ్రహ్మోత్సవములు, ఈరోజు గిరిప్రదక్షిణ దిగ్విజయంగా జరుగుటకు కారణమైన ఆలయ అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు మరియు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి రేపు సాయంత్రం పవిత్ర కృష్ణా నది యందు నిర్వహించు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల "కృష్ణవేణి నదీ విహారం"(ఉత్తరాయణ కాలం నందు) కార్యక్రమం గురించి తెలిపి, భక్తులందరూ "కృష్ణవేణి నదీ విహారం" నకు విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావలిసినదిగా కోరియున్నారు.
అనంతరం ఆలయ కార్యనిర్వాహనాధికారి మాట్లాడుతూ దేవస్థానం నందు అత్యంత వైభవముగా నిర్వహించిన శ్రీ అమ్మవారి చైత్రమాస బ్రహ్మోత్సవములు, వాహన సేవలు దిగ్విజయంగా జరిగినవని తెలిపి, ఈరోజు పౌర్ణమి సందర్బంగా (3వ సారి) గిరిప్రదక్షిణ కార్యక్రమం నందు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగిందని, గిరిప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుటకు కారణమైన అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు మరియు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి రేపు సాయంత్రం దేవస్థానం నందు బ్రహ్మోత్సవములలో భాగముగా ఉత్తరాయణ కాలం నందు మొట్టమొదటి సారిగా నిర్వహించు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల "కృష్ణవేణి నదీ విహారం" కార్యక్రమం గురించి తెలిపి, భక్తులందరూ "కృష్ణవేణి నదీ విహారం" నకు విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావలిసినదిగా కోరియున్నారు.
అనంతరం ఆలయ స్థానాచార్యుల వారు మాట్లాడుతూ ఉత్తరాయణ పుణ్యకాలమందు రేపు సాయంత్రం నిర్వహించు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల "కృష్ణవేణి నదీ విహారం" యొక్క వైశిష్ట్యత మరియు వివరములు తెలియజేశారు.
addComments
Post a Comment