లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన మునగపాటి.

 *లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన మునగపాటి


*


 మంగళగిరి (ప్రజా అమరావతి); శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలీయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, వైసిపి నాయకుడు  మునగపాటి వెంకటేశ్వరరావు యువనేత నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదోని నియోజకర్గం కుప్పగల్లు శివార్లలో భోజన విరామ సమయంలో  మునగపాటి యువనేతను కలిశారు. పసుపుకండువా కప్పి మునగపాటిని యువనేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  మునగపాటితోపాటు ఆయన కుమారుడు చినరాజా, సోదరుడు రమేష్ కూడా పార్టీలో చేరారు. మునగపాటి వెంకటేశ్వరరావు చేరికతో టిడిపిలో ఆ సామాజిక వర్గ నేతలు కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

Comments