భవానీపురంలో రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించనున్న రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.

 

విజయవాడ (ప్రజా అమరావతి);

భవానీపురంలో రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించనున్న రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి 

శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ అంధ్వర్యంలో భవానీపురంలో ఏర్పాటు చేసిన రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్స్ సెంటర్ - ఇ వి పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ ను రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, గనులు, భూగర్భ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు.  భవానీపురంలో గల ఆంధ్ర ప్రదేశ్ కౌన్సిల్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఏర్పాటు చేసిన రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్స్ సెంటర్ ను మంత్రి ఈనెల 20వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించా నున్నారు.  అనంతరం ఎలెక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేసిన " గో ఎలక్ట్రిక్ క్యాపైన్ " ను మంత్రి ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆంధ్ర ప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు. 

Comments