*స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యతపై ఆడిటింగ్ చేయాలి*
*: మండల స్థాయి టీంలు ఏర్పాటు చేసి ఆడిటింగ్ నిర్వహించాలి*
*: స్పందన కార్యక్రమంలో మండల స్థాయి అధికారులంతా ఒకే చోట నుంచి పాల్గొనాలి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి):
స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యతపై మండల స్థాయి టీంలు ఏర్పాటు చేసి ఆడిటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 201 అర్జీలను స్వీకరించడం జరిగింది. అనంతరం డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో నిర్వహించే స్పందన గ్రీవెన్స్ లో అన్ని శాఖల అధికారులంతా కలిసి కూర్చుని కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. స్పందన గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలకు సంబంధించి పరిష్కారం చూపించిన అనంతరం నాణ్యత విషయంలో పరిశీలన చేసేందుకు మండల స్థాయిలో ఆడిటింగ్ టీం లను ఏర్పాటు చేయాలని, ఆ టీంల ద్వారా గ్రీవెన్స్ పై ఆడిటింగ్ నిర్వహించాలన్నారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలు ఏవేవి ఉన్నాయని అనేది ఆన్లైన్లో ఓపెన్ చేసి చూసుకోవాలని, వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆయన శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించడం అత్యంత ముఖ్యమన్నారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించే స్పందన గ్రీవెన్స్ కార్యక్రమానికి అధికారులంతా సకాలంలో హాజరు కావాలని సూచించారు.
హౌసింగ్ సంబంధించి సామూహిక గృహప్రవేశాల్లో భాగంగా మే రెండవ వారానికి రాష్ట్రవ్యాప్తంగా 3.75 లక్షల ఇళ్లు పూర్తి కావాలని లక్ష్యం నిర్ణయించగా, జిల్లాకు 10,658 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం కేటాయించడం జరిగిందని, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పది రోజుల్లోపు లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవాలన్నారు. జగనన్న కాలనీలో తాగునీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్స్, తదితర మౌలిక సదుపాయాల కల్పన పూర్తిస్థాయిలో ఉండాలని, ఈ విషయమై హౌసింగ్ డీఈలు పరిశీలన చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలకు సంబంధించి 73 నిర్మాణాలు బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని, వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. గ్రౌండింగ్ కాని నిర్మాణాల విషయమై నెలకొన్న స్థలం సమస్యను పరిష్కరించి వెంటనే గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 0-5, 5-19 ఏళ్ల వారి ఆధార్ అప్డేట్ ను ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలన్నారు. అమ్మ ఒడి, జగనన్న తోడు తదితర పథకాలకు సంబంధించి అక్నాలెజ్మెంట్ కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలన్నారు. కన్సిస్టెంట్ రిథమ్స్ కింద పాఠశాలల తనిఖీ పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద జిల్లాకు 65 వేల మంది కూలీలకు పనులు కల్పించాలని లక్ష్యం నిర్ణయించగా, 59 వేల మంది పనులకు వస్తున్నారని, వారం రోజుల్లోపు పూర్తిస్థాయిలో ఎక్కువ మంది కూలీలకు పని కల్పించి లక్ష్యం చేరుకోవాలన్నారు. అమృత్ సరోవర్ వారి కింద జిల్లాలో 48 చెరువుల్లో ఇంకా పనులు చేపట్టాల్సి ఉందని, సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద మంజూరైనా మొదలుకాని పనులను వెంటనే మొదలు పెట్టాలని, ఈ కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో పురోగతి చూపించాలన్నారు. రీ సర్వే కింద ఎంపిక చేసిన గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ కోసం 2,000 రాళ్లు రావడం జరిగిందని, రెండు రోజుల్లోపు స్టోన్ ప్లాంటేషన్ పనులు పూర్తి కావాలని, ఈ విషయమై ఆర్డీవోలు దృష్టి సారించాలన్నారు. అవసరమైన రోవర్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కువ టీములను నియమించుకొని స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. మనబడి నాడు - నేడు కింద జిల్లాలో రెండవ విడతలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. స్పందన గ్రీవెన్స్ లో భాగంగా రెవెన్యూ కి సంబంధించి రీఓపెన్ కేసులు 15 ఉన్నాయని, అధికారులు అందించే ఎండార్స్మెంట్లు అర్జీదారుడికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలని, అర్జీలు మళ్ళీ రీ ఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లు రాకుండా చూసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా స్పెషల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ "ఏ డ్రగ్ ఫ్రీ స్టేట్" అంటూ జిల్లా అధికారుల చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమోహన్ రెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిఈఓ మీనాక్షి, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఇన్చార్జి డిఈఓ మీనాక్షి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment