*నేటి నుండి మంగళగిరి నియోజకవర్గంలో "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం ప్రారంభం...
*
మంగళగిరి (ప్రజా అమరావతి);
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు , మర్రి రాజశేఖర్ , పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ ప్రారంభించారు...
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో MP అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని నేటి నుండి ఇంటింటికి వివరించనన్నట్లు..
గత ప్రభుత్వాలకి ఇప్పుడు జగనన్న ప్రోగ్రాంలో జరిగిన సంక్షేమానికి ఉన్న తేడాను స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న భవనతోనే జగనన్నే మా భవిష్యత్తు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్లు మరియు పార్టీ గృహసారథులు వివరించనున్నట్లు తెలిపారు.
అనంతరం మంగళగిరి పట్టణంలో 16వ సచివాలయం పరిధిలో పావురాలు కాలనీ నందు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అని, ప్రస్తుత ప్రభుత్వంపై సుముఖంగా ఉన్నారా లేదా అని, భవిష్యత్తులో జగనన్న పాలనను కావాలనుకుంటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారి ఇళ్ళకు *"మా నమ్మకం నువ్వే జగన్"* స్టిక్కర్ను ఇంటింటికి అంటించి, 82960 82960 నెంబర్ కు లబ్ధిదారుల ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
addComments
Post a Comment