*సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు అందజేత*
*: ఉత్తమ పనితీరుతో అవార్డులు పొందిన వారికి అభినందనలు*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి):
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచి అవార్డులు పొందిన సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అభినందించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 8 గ్రామ పంచాయతీలు వివిధ పథకాలను సక్రమంగా అమలుపరిచి ఉత్తమ అవార్డుకు ఎంపికైన సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
జిల్లాలో బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామంలో పేదరికం లేని ఆరోగ్యం మరియు జీవనోపాధి (పావర్టీ ఫ్రీ అండ్ హేన్ హేన్స్డ్ లైవ్లీ హుడ్)ని సక్రమంగా అమలు చేసినందుకు సర్పంచ్ శారదమ్మ, పంచాయతీ కార్యదర్శి అలివేలమ్మలకు ప్రశంస పత్రాలు అందజేసి శాలువాతో జిల్లా కలెక్టర్ సత్కరించారు. చిలమత్తూరు మండలం కోడికొండ గ్రామంలో పిల్లలతో స్నేహపూర్వకంగా (చైల్డ్ ఫ్రెండ్లీ) ఉండడంతో సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, పంచాయతీ కార్యదర్శి నాగరాజును సత్కరించారు. గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో హెల్తీ పంచాయతీలు అమలు చేసినందుకు సర్పంచ్ శ్రీరాములు, పంచాయితీ కార్యదర్శి బాబ్ జాన్ ను సత్కరించారు. తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామంలో సెల్ఫ్ షఫీషియెంట్ అమలుకు గాను సర్పంచ్ పూల లత, పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్ ను సత్కరించారు. నల్లచెరువు మండలం తవలమర్రీ గ్రామంలో సోషియల్ సెక్యూర్డ్ అమలుకుగాను సర్పంచ్ మల్లికార్జునమ్మ, పంచాయతి కార్యదర్శి విజయ్ కుమార్ ను సత్కరించారు. తలుపుల మండలం తలపుల పంచాయతీలో పంచాయతీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అమలుకుగాను సర్పంచ్ పల్లె శ్రీలత, పంచాయతీ కార్యదర్శి మాధవరెడ్డిలను సత్కరించారు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఉత్తమ ఉమెన్ పంచాయతీ అమలుకు సర్పంచ్ రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ లను సత్కరించారు. ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో సఫిషియంట్ వాటర్ ఇచ్చినందుకు సర్పంచ్ నరసమ్మ, పంచాయతీ కార్యదర్శి గణేష్ రెడ్డిలను జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేసి శాలువాతో జిల్లా కలెక్టర్ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్వో కొండయ్య, జిల్లా పంచాయతీ అధికారి జి.విజయకుమార్, డిఎల్డివోలు శివారెడ్డి, బాలాజీ, శివకుమారి, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment