మచిలీపట్నం, ఏప్రిల్ 6 (ప్రజా అమరావతి);
పేద వర్గాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం
ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష పేర్కొన్నారు.
గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ గా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష, పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారధితో కలిసి కంకిపాడు మండలం వణుకూరు గ్రామంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ -వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని పేద వర్గాల ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు మరింత అందుబాటులోకి తెచ్చిందన్నారు. జిల్లాలో 104 వాహనాలు 34 ఉన్నాయని, ప్రతి గ్రామానికి పర్యటన షెడ్యూలు వేసుకొని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు గ్రామాల్లో ప్రతి ఇంటికి కచ్చితంగా వచ్చి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని కావలసిన మందులు అందజేస్తారన్నారు.
ఇది ఆదర్శవంతమైన కార్యక్రమమని వైద్య ఆరోగ్యశాఖ ఎంతో అంకితభావంతో సేవలు అందించాలన్నారు.
బాలింతలు, గర్భవతులు, వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం వైద్యరంగంలో ఒక విప్లవాత్మకమైన కార్యక్రమమని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యం విద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
సమాజంలో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు చాలా మార్పులు తీసుకొస్తుందన్నారు. వీటి ద్వారా పేద వర్గాల ప్రజలకు నూటికి నూరు శాతం ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని
ఇటీవల ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని రోడ్లు నిర్మిస్తేనే అభివృద్ధాని ప్రశ్నించారు.
గతంలో 7428 ఆరోగ్య కేంద్రాలు ఉండేవని నేడు 10,025 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నారు. గతంలో 5 వేల మందికి ఒక ఏఎన్ఎం ఉండగా నేడు ప్రతి 2వేల మందికి ఒక ఏఎన్ఎం నియామకం జరిగిందన్నారు.
ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయని, ఒక్కో పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు ఉంటారని వారు ఒకరి తర్వాత ఒకరు ప్రతిరోజు గ్రామంలోని ప్రతి ఇంటికి వచ్చి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ధనిక వర్గాల ప్రజలకు కుటుంబ డాక్టర్ ఉంటారని అదే తరహాలో పేద వర్గాల ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా కుటుంబ డాక్టర్ను ఏర్పాటుచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని మనసారా అభినందించాలన్నారు. వణుకూరు ఆరోగ్య కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిందని, అలాగే రైతు భరోసా కేంద్రం కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని గుర్తు చేశారు.
తొలుత జిల్లా కలెక్టర్ శాసనసభ్యులతో కలిసి నూతన 104 వాహనాన్ని ప్రారంభించారు.
అనంతరం కొంతమంది వ్యాధిగ్రస్తులకు జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవికుమార్, ఎంపీడీవో సునీత శర్మ, తహసిల్దార్ సతీష్, జడ్పిటిసి బి కోటేశ్వరమ్మ, వణుకూరు సర్పంచ్ విజయలక్ష్మి, తదితర అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు
addComments
Post a Comment