ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, స్ఫూర్తిగా నిలిచేందుకు నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను జరుపుకుంటున్నాం

 *ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, స్ఫూర్తిగా నిలిచేందుకు నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను జరుపుకుంటున్నాం




*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పత్రికా ప్రకటన

పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి):


ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, వారికి స్ఫూర్తిగా నిలిచేందుకు నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను జరుపుకుంటున్నాము అని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోనే మినీ కాన్ఫరెన్స్ హాలు నందు 16వ నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్.చేతన్, ఆర్డీవో భాగ్యరేఖ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ విభాగాలలో నిమగ్నమై ఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న దీనిని పాటిస్తారన్నారు. పౌర సేవకులు దేశం యొక్క పరిపాలనా యంత్రాంగాన్ని సమిష్టిగా మరియు పౌరులకు సేవ చేయాలనే అంకితభావంతో నడపాలని కూడా ఈ రోజు ప్రధాన అంశమన్నారు. మనకు తెలిసినట్లుగా సివిల్ సర్వీస్ అనేది దేశ ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలనకు బాధ్యత వహించే సేవ అని, 16వ నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను సందర్భంగా సభ్యులచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments