జిల్లా, డివిజన్, మండల అధికారులు హెడ్ క్వార్టర్లలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలి

 *జిల్లా, డివిజన్, మండల అధికారులు హెడ్ క్వార్టర్లలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలి*


*: స్పందన కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇతర అన్ని శాఖల అధికారులు ఒకే చోట నుంచి పాల్గొనాలి*


*: తహసీల్దార్, ఎంపీడీవో, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి*


*: ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ఆస్పత్రులను తనిఖీలు చేపట్టాలి*


*: అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ల నియామకం ఈనెల 25 నాటికి పూర్తి కావాలి*


*: కుటుంబ వైద్యుడు విధానం కింద సచివాలయాల్లో డాక్టర్ల ఫోన్ నెంబర్లు, పేర్లు ప్రదర్శించాలి*


*: గడపగడపకు మన ప్రభుత్వం కింద గుర్తించిన పనులకు శాంక్షన్ తీసుకొని సకాలంలో పూర్తి చేయాలి*


*: నాడు - నేడు కింద చేపట్టిన పనులను వేగవంతం చేయండి*


*: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి):


మండల, డివిజన్, జిల్లా అధికారులు పనిచేసే చోట.. ప్రధాన కార్యాలయాల ప్రాంతాల్లో ఖచ్చితంగా నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. ఒకవేళ ప్రధాన కార్యాలయం నుంచి బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారులతో అనుమతి తీసుకుని వెళ్లాలని, అనుమతి తీసుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారులు, డివిజన్, మండల అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు పని చేసే నివాసం ఉండడం వల్ల కిందిస్థాయి అధికారులు, సిబ్బంది కూడా స్థానికంగానే ఉండేందుకు అవకాశం ఉంటుందని, కాబట్టి అధికారులంతా స్థానికంగానే ఉండాలన్నారు. అధికారులు స్థానికంగా నివాసం ఉన్నారా లేదా అనే దానిపై రిపోర్టులను అందజేయాలన్నారు.


సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ నుంచి స్పందన, చలివేంద్రాల ఏర్పాటు, గడప గడపకు మన ప్రభుత్వం పనులు, మనబడి నాడు - నేడు, కన్సిస్టెంట్ రిథమ్స్, కుటుంబ వైద్యుడు విధానం, పాఠశాలలు, హాస్టల్లు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ఆస్పత్రుల తనిఖీ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకం, తదితర అంశాలపై పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, సిపిఓ విజయ్ కుమార్, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఇన్చార్జి డిఈఓ మీనాక్షి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ శివారెడ్డి, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, డిఎంహెచ్వో డా.కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


స్పందనలో ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇతర అన్ని శాఖల అధికారులు ఒకే చోట నుంచి పాల్గొనాలి :


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇతర అన్ని శాఖల అధికారులు ఒకే చోట నుంచి పాల్గొనాలన్నారు. వచ్చే సోమవారం నుంచి అందరూ ఒకే చోట కూర్చోవాలని, అక్కడే అందరూ అర్జీలను స్వీకరించాలని, అర్జీలకు నాణ్యత కలిగిన పరిష్కారం చూపించాలన్నారు. ఒక చోట కాకుండా వారి వారి కార్యాలయాల నుంచి అధికారులు స్పందనలో పాల్గొనడం చేయడం తగదని, దీనిని స్వాగతించమన్నారు.


ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ఆస్పత్రులను తనిఖీలు చేపట్టాలి :


ఇకపై ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ఆస్పత్రులను తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శుక్రవారం జిల్లా అధికారులకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుందని, కేటాయించిన షెడ్యూల్ మేరకు అధికారులంతా జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ఆస్పత్రులను తనిఖీలు చేయాలని, తనిఖీ అనంతరం ఫీడ్బ్యాక్ రూపంలో అక్కడ నెలకొన్న సమస్యలను తమకు తెలియజేయాలన్నారు. దాంతోపాటు వారి శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలన చేయాలన్నారు.


చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి :


వేసవికాలం మొదలైన నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, మండల తహసీల్దార్, ఎంపీడీవో, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దీని ద్వారా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ల నియామకం ఈనెల 25 నాటికి పూర్తి కావాలన్నారు. నియామకం ప్రక్రియను సకలను పూర్తిచేసేలా చూడాలని ఐసిడిఎస్ పీడీని ఆదేశించారు. జిల్లాలోని పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలకు సమయానికి కోడిగుడ్డు, నూనె పూర్తిగా సరఫరా చేయడం లేదని, ఎప్పటికప్పుడు నిత్యవసరాలను సరఫరా చేయాలని సూచించారు. ఆయా సచివాలయాల ద్వారా 0 -6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల ఆధార్ అప్డేట్ లో పురోగతి చూపించాలని,  పీఎంజేఏవై కార్డులకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియను ఈనెల 25 నాటికి 90 శాతం పైగా పూర్తి చేయాలని, ఎంపీడీవోలు ఈ ప్రక్రియలపై దృష్టి సారించాలన్నారు.


కుటుంబ వైద్యుడు విధానం కింద సచివాలయాల్లో డాక్టర్ల ఫోన్ నెంబర్లు, పేర్లు ప్రదర్శించాలి :


కుటుంబ వైద్యుడు విధానం కింద సచివాలయాలలో డాక్టర్ల ఫోన్ నెంబర్లు, పేర్లు ప్రదర్శించాలన్నారు. సచివాలయాలకు ఏ డాక్టర్ వస్తున్నారు అనేది తెలియజేయాలని, ఫోన్ నెంబర్లు, పేర్లు ఖచ్చితంగా ప్రదర్శించాలని సూచించారు. కన్సిస్టెంట్ రిథమ్స్ కింద మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారి పరిధిలోని పాఠశాలలను పరిశీలన చేయాలని, గత వారం పాఠశాలల తనిఖీ తక్కువగా చేయడం జరిగిందని, ఈ విషయమై వెంటనే పురోగతి ఉండేలా చూసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా వచ్చిన సమస్యల పరిష్కారంలో నాణ్యత విషయమై పరిశీలన చేయాలన్నారు.


గడపగడపకు మన ప్రభుత్వం కింద గుర్తించిన పనులకు శాంక్షన్ తీసుకొని సకాలంలో పూర్తి చేయాలి :


జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కింద గుర్తించిన పనులకు సకాలంలో శాంక్షన్ తీసుకోవాలని, అనంతరం పనులను మంజూరు చేయించుకుని గ్రౌండింగ్ చేపట్టి నిర్దేశిత సమయంలోగా పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మనబడి నాడు - నేడు కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. నాడు - నేడుకు సంబంధించి బడ్జెట్ మొత్తం రావడం జరిగిందని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులను వేగంగా పూర్తి చేసేలా చూడాలని డీఈవోకు సూచించారు. అలాగే వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించి నిజా నిజాలు పరిశీలన చేసి నిజం ఏమిటో తెలియజేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.




.

Comments