బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి


నెల్లూరు (ప్రజా అమరావతి);


శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా బ్రహ్మోత్సవాలను  ఘనంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల


ని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ మాలోల పేర్కొన్నారు. 


శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుండి మే నెల 10వ తేదీ వరకు జరగనున్న సంధర్భంగా  గురువారం ఉదయం  నెల్లూరు ఆర్.డి.ఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ మాలోల అధ్యక్షతన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా  ఆర్.డి.ఓ శ్రీ మాలోల మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ నుండి మే నెల 10వ తేదీ వరకు జరగనున్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా బ్రహ్మోత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో  ఘనంగా  నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు  ముందస్తు ఏర్పాట్లు  పటిష్టంగా చేపట్టాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన  త్రాగునీటి సౌకర్యం ఏర్పాట్లపై  ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామ పంచాయతీ వారు యాత్రికులకు ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు అన్ని వేళలో  దేవాలయ పరిసర ప్రాంతాలను   ఎప్పటికప్పుడు  శుభ్రపరుస్తూ బిచింగ్ పౌడర్ చల్లుతూ  పారిశుద్ద్య ఏర్పాట్లు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  త్రాగునీటి ట్యాంకుల యందు క్లోరినేషన్ చేయాలని తాత్కాలిక మరుగుదొడ్లు కూడా నిర్మించాలని సూచించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా  గరుడ సేవ, కళ్యాణోత్సవం, రాధోత్సవం రోజుల్లో భద్రత ఏర్పాట్లపై పోలీసు శాఖ వారు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.    భక్తుల సౌకర్యం మేరకు ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆర్టిసి డిపో అధికారులను ఆదేశించారు. భక్తులకు అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత వైద్యులను సూచించారు. విద్యుత్ శాఖ వారు ఉత్సవాల దినాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అవసరమైతే ప్రత్యేక ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ వారు ఉత్సవాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండుటకు గాను అవసరమైన  అగ్నిమాపక నిరోధక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు. అన్ని వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కల్గకుండా అవసరమైన అన్నీ ఏర్పాట్లతో పాటు     పోలీస్ అధికారుల సూచనకు అనుగుణంగా  ముఖ్య ప్రదేశాలలో టోల్ గేట్లు పార్కింగ్ ప్రదేశాల్లో అవసరాలకు అనుగుణంగా  సీసీ కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నామని, భక్తుల కాలక్షేపం కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీ  వేమిరెడ్డి సురేంద్ర , ఆర్.డి.ఓ కు తెలిపారు.


అనంతరం దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన  వాల్ పోస్టర్స్ ను  ఆర్డిఓ, దేవస్థాన కమిటీ వారితో కలిసి ఆవిష్కరించారు.


ఈ సమావేశంలో   దేవాదాయ శాఖ ఏసీ  శ్రీనివాసులురెడ్డి,  ఆలయ ఈఓ  గిరికృష్ణ, ఎంపిడిఓ  శైలేంద్ర కుమార్,  దేవరపాలెం సర్పంచ్  అశోక్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments