విజయనగరం, ఏప్రిల్ 12 (ప్రజా అమరావతి):
వ్యవసాయ కమ్మిషనరు వారి ఆదేశానుసారము ప్రతీ జిల్లాలో మట్టి నమునాల సేకరణ మరియు మృత్తిక పరీక్షల నిర్వహణ
కు 10-4-2023 నుండి 16-4-2023 వరకు ప్రతీ జిల్లా స్థాయిలో మరియు మండలాల స్థాయిలో రైతులకు అవగాహన కల్గించడానికి శిక్షణ ఇవ్వవలసినదిగా ఈ వారాన్ని మృత్తికా అవగాహన వారముగా నిర్వహించాలని ఆదేశించారు .
పై ఆదేశాల మేరకు తేదీ 12. 4. 2023 భూసార పరీక్ష మరియు విశ్లేషణలపై జిల్లాస్థాయి వర్క్ షాపు జిల్లా వనరుల కేంద్రము వద్ద నిర్వహించడం జరిగినది. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వీ.టి రామారావు గారు ఆధ్వర్యంలో జరిగినది. జిల్లాలో గల సహాయ వ్యవసాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు మరియు మండలానికి ఒక్కొక్కరు చొప్పున రైతు భరోసా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకులు, భూసార పరీక్షా కేంద్రంలో పనిచేస్తున్న ఏవోలు హాజరైనారు.
1. శ్రీ వి.టి రామారావు గారు జిల్లా వ్యవసాయ అధికారి ,సంబంధిత ఆర్ బి కే ల నుండి పొలములో మట్టినమూణాలు సేకరించి తగు వివరములతో భూసార పరీక్ష కేంద్రాలకు సరైన టైంలో పంపించాలని , మట్టి నమూనాల విశ్లేషణల ఫలితాలు రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు.
2. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగి ముఖ్యంగా ,RBK స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులు భావవ్యక్తీకరణను స్పష్టంగా అర్థం చేసుకుని ,రైతులతో మాట్లాడాలని, పనిని సులభతరం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని సూచించారు.
3. శ్రీ శ్రీమతి బి భానులత వ్యవసాయ సహాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం విజయనగరం వారు మాట్లాడుతూ భూసార మట్టి నమూనాలను ఎలాగ సేకరించాలి? మరియు వాటిని భూసార పరీక్షా కేంద్రానికి విశ్లేషణ కొరకు ఏ విధంగా పంపించాలన్న వివరాలు చెప్పారు.
4. శ్రీ ఆనందరావు డిపిఎం నాచురల్ ఫామింగ్ వారు నేలల భౌతిక లక్షణములు వాటి యాజమాన్యం గూర్చి వివరించారు.
5. శ్రీ కె. ప్రకాష్ గారు రీజనల్ కోఆర్డినేటర్ నేచురల్ ఫామింగ్ భూసారాన్ని నేచర్ల ఫార్మింగ్ ద్వారా ఎలా పరిరక్షించుకోవాలో తెలిపారు
తదుపరి మట్టినమునా సేకరణ చేసే విధానమును పాల్గొన్న శిక్షకులతో చేయించారు.
addComments
Post a Comment