తిరుమల, 15 ఏప్రిల్ (ప్రజా అమరావతి);
సీతంపేటలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
మన్యం జిల్లా సీతంపేటలో ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. డెప్యుటేషన్ సిబ్బందికి బస ఏర్పాట్లు చేయాలని, భక్తులకు అవసరమైన తాగునీరు, అన్న ప్రసాదాలు సిద్ధం చేయాలని సూచించారు. ఆలయం, కల్యాణ మండపం వద్ద విద్యుద్దీపాలంకరణ చేపట్టాలన్నారు. భక్తులు ఎండ వేడికి ఇబ్బంది పడకుండా చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల్లో విచ్చేసిన భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయం వద్ద సుందరీకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలన్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణకు విచ్చేసే వేద పండితులు, అర్చకస్వాములకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని సూచించారు.
ఈ సమీక్షలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఎస్ఇ ఎలక్ట్రికల్స్ శ్రీ వెంకటేశ్వర్లు, ఈ ఈ శ్రీవేణుగోపాల్ విజివో శ్రీ మనోహర్ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment