నెల్లూరు, ఏప్రిల్ 16 (ప్రజా అమరావతి): ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి పాలనపట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నార
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించిన మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
తొలుత గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నాడు నేడు మొదటి విడత కింద రూ. 61.71 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలోని ఆదాల నగర్ గిరిజన కాలనీలో గడపగడపకు వెళ్లిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని తెలుసుకుని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రతి గడపలోనూ మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనికేపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని గొలగమూడి లో ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, ఎంతో విలువ గల గొలగముడిలోని భూములను పేదలకు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. గొలగమూడి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని, ఆశ్రమానికి సంబంధించి కాలేజీ ని కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చామని, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తిస్థాయిలో నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు అవసరమో తెలుసుకొని ఆ పనులను కూడా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుస్మిత, గురుకుల పాఠశాల హెచ్ఎం కొండలరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment